Home Latest News టీటీడీ పేర లక్కీడ్రా స్కాం.. కోట్ల రూపాయల మోసంపై కేసు | లక్కీ ఫ్రా స్కామ్| లో| పేరు| ttd| కేసు| పునఃప్రారంభించబడింది| ఫిర్యాదు| కరాటే – Andhra Waves

టీటీడీ పేర లక్కీడ్రా స్కాం.. కోట్ల రూపాయల మోసంపై కేసు | లక్కీ ఫ్రా స్కామ్| లో| పేరు| ttd| కేసు| పునఃప్రారంభించబడింది| ఫిర్యాదు| కరాటే – Andhra Waves

by andhra andhrawave
0 comments
టీటీడీ పేర లక్కీడ్రా స్కాం.. కోట్ల రూపాయల మోసంపై కేసు | లక్కీ ఫ్రా స్కామ్| లో| పేరు| ttd| కేసు| పునఃప్రారంభించబడింది| ఫిర్యాదు| కరాటే


పోస్ట్ చేయబడింది జనవరి 19, 2026 3:30PM


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరుతో సోషల్ మీడియాలో లక్కీ డ్రా ప్రచారం నిర్వహిస్తున్న ప్రజలను మోసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు, పోలీసులు ఐపీసీ 318(4), ఐటీ యాక్ట్–2008లోని 66 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు యువకులను పోలీసులు నిందితులుగా గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు సోషల్ మీడియా వేదికగా టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం. రూ.399 చెల్లిస్తే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్ వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందంటూ విస్తృతంగా ప్రకటనలు చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన వేలాది మంది అమాయకులు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించినట్లు ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా కోట్ల రూపా యల మేర ప్రజల నుంచి వసూళ్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ లక్కీ డ్రా ప్రచారానికి నమ్మకం కలిగించేలా నిందితులు తిరుమలలోని టీటీడీ ఆలయ ప్రాంగణాన్ని నేపథ్యంగా చేసుకొని వీడి యోలు, రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రస్తుతం నిందితుల ఆర్థిక లావాదేవీలు, బాధితుల సంఖ్యపై తెచ్చే పనిలో పోలీసులు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird