Home సినిమా ఎవరు ఆ ముగ్గురు.. ఆసక్తి రేపుతున్న రష్మిక వ్యాఖ్యలు – Andhra Waves

ఎవరు ఆ ముగ్గురు.. ఆసక్తి రేపుతున్న రష్మిక వ్యాఖ్యలు – Andhra Waves

by
0 comments
ఎవరు ఆ ముగ్గురు.. ఆసక్తి రేపుతున్న రష్మిక వ్యాఖ్యలు



-ఆసక్తికరంగా రష్మిక వ్యాఖ్యలు
-తన వ్యాఖ్యల్లో మర్మమేంటి
-వాళ్ళు కూడా బతకాలిగా
-ఇంతకీ ఏమని చెప్పింది

వరుస పాన్ ఇండియా హిట్స్ తో దూసుకుపోతు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న(రష్మిక మందన్న). పైగా అతి తక్కువ వ్యవధిలోనే ఆ స్థాయి ఇమేజ్ ని పొందిందంటే రష్మిక కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. భారీ అభిమాన ఘనం కూడా ఆమె సొంతం. రీసెంట్ గా తన కెరీర్ కి సంబంధించి రష్మిక చెప్పిన కొన్ని విషయాలు అభిమానులు, మూవీ లవర్స్ తో పాటు ఫిలిం సర్కిల్స్ లో సరికొత్త చర్చకి దారితీశాయి. అంతలా చర్చకి దారి తీసిన అంశాలేంటో చూద్దాం.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ‘కొంత మంది వ్యూస్ తో డబ్బు సంపాదించడం కోసం ఏదేదో ఊహించుకుంటూ తప్పుడు కథనాలు ప్రచురిస్తారు. మొదట్లో బాధగా అనిపించినా, ఇప్పుడు మాత్రం వాళ్ళు కూడా బతకాలి కదా అనిపిస్తుంది. ఇండస్ట్రీ లో ఉన్న వారికి నెగిటివిటి కామన్. ఆ విషయంలో ఎవరు మారడం లేదు. నేను ఎక్కువ పారితోషకం తీసుకుంటాననే రూమర్ ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదు. కానీ ఈ న్యూస్ నిజమైతే బాగుండని ఎన్నో సార్లు అనుకుంటాను. స్పెషల్ సాంగ్స్ లో చెయ్యడానికి నేను ఓకే. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్ అయ్యి ఉండాలి.

ఇది కూడా చదవండి: ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. తొలి తెలుగు చిత్రమని మేకర్స్ ప్రకటన

కానీ ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులు ఉన్నారు. వాళ్ళు అడిగితే వాళ్ల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తాను. ప్రస్తుతం నేను హీరోయిన్ ని కాబట్టి ప్రేక్షకులకి వినోదాన్ని పంచ నా పని. అందుకే ప్రేక్షకుల్లో అన్ని రకాల జోనర్స్ వాళ్ళు ఉంటారని మాగ్జిమమ్ అన్ని రకాల జోనర్స్ లో చేస్తూ వస్తున్నానంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇక స్పెషల్ సాంగ్ వ్యాఖ్యలపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా పలు రీతుల్లో చెబుతున్నారు. ప్రీవియస్ మూవీ గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక మరో మారు తన పెర్ ఫార్మెన్స్ తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాక్ టైల్ 2 , మైసా వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ రష్మిక ఖాతాలో ఉన్నాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird