జనవరి 19, 2026 11:41AMన పోస్ట్ చేయబడింది

యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. తుర్కపల్లి మండలం పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో ఓ పొలం వద్ద లేగదూడపై పులి దాడి చేసి చంపింది. ఈ ఘటనతో పరిసర గ్రామాలప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో వీరారెడ్డిపల్లి, గంధమల్ల, ఎన్‌జీ బండల్, కోనాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, శాఖ అధికారులు తెలిపారు.
రాత్రి వేళల్లో పొలాల వైపు వెళ్లవద్దని సూచించారు. అలాగే పశువులను సురక్షితంగా ఉంచాలన్నారు. పులి కదలికలపై శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. త్వరలో పులిని బంధించి దత్తమైన ప్రాంతంలో విడిచిపెడతామనీ, అంతవరకూ అప్రమత్తంగా ఉండాలనీ అధికారులకు సూచించారు.
