Home Latest News మత్స్యాకురుల బీమా పరిహారం రూ. 10 లక్షలకు పెంపు | మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త| భీమా| పాదయాత్ర | ఐదు – Andhra Waves

మత్స్యాకురుల బీమా పరిహారం రూ. 10 లక్షలకు పెంపు | మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త| భీమా| పాదయాత్ర | ఐదు – Andhra Waves

by andhra andhrawave
0 comments
మత్స్యాకురుల బీమా పరిహారం రూ. 10 లక్షలకు పెంపు | మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త| భీమా| పాదయాత్ర | ఐదు


జనవరి 19, 2026 9:48AMన పోస్ట్ చేయబడింది


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సముద్రంపై జీవిస్తున్న లక్షలాది మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటి వరకు ఉన్న రెండు లక్షల ప్రమాద బీమా పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారి బీమాను ఐదు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన , రాష్ట్ర ప్రభుత్వ నిధుల సమన్వయంతో ఈ పెంపును అమలు చేస్తారు.


ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. వారి ఈ బీమా సదుపాయం మరణం సంభవించిన తీరును బట్టి రెండు రకాలుగా ఉంటుంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే, ఆ మత్స్యకార కుటుంబానికి కొత్త నిబంధనల ప్రకారం రూ. 10 లక్షల భారీ పరిహారం నేరుగా అందుతుంది. అయితే, వేటతో సంబంధం లేకుండా సాధారణ అనారోగ్యం, ఇతర ప్రమాదాల్లో మరణించారు. 2 లక్షల బీమా సహాయం. ఈ నిర్ణయం వల్ల వేట సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా అండ లభించనుంది.

ప్రస్తుత ప్రభుత్వం కేవలం బీమా పరిహారం ఇప్పుడు పెంచింది. ఇంతకు ముందే.. సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఇరవై వేల రూపాయలకు పెంచింది. అలాగే సబ్సిడీపై వలలు , బోట్ల ఇంజిన్లను అందజేయడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా చర్యలు తీసుకుంటోంది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird