జనవరి 18, 2026 11:41AMన పోస్ట్ చేయబడింది

దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరఆదివారం (జనవరి 18) రాత్రి నుంచి ప్రారంభం. ఇందు కోసం సర్వం సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీ వరకూ జరిగే ఈ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరుగుతుంది. మేస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన నాగోబాకు పుష్యమాస అమావాస్య రాత్రి నిర్వహించే మహాపూజలతో ఈ జాతర ప్రారంభం అవుతుంది. . ఈ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.
మెస్రం వంశీయులు విత్ర గోదావరి జలాలతో మంచిర్యాల ఏర్పాటు హస్తిన మడుగు నుంచి కాలినడకన వచ్చి నాగోబాకు అభిషేకం చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం ఏడు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. జాతరలో భాగంగా 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్ పూజ, మహిళలు విశేషంగా పాల్గొనే భాన్ దేవత పూజలు జరుగుతాయి.
ఈ జాతరలో భాగంగా ఈ నెల 22న గిరిజన దర్బార్ జరుగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో పాటు ఇతర ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. ఈ జాతర కోసం మెస్రం వంశీయులు తెల్ల దుస్తులు ధరించి.. కలమడుగు వద్ద గోదావరి జలాలను సేకరించి పాదయాత్రగా కేస్లాపూర్ చేరుకున్నారు. శనివారం (జనవరి 17) తూమ్ పూజలు ముగించారు. ఆదివారం (జనవరి 18) ప్రధాన ఉత్సవంలో పాల్గొంటారు. ఈ జాతర కోసం కేస్లాపూర్ పొలిమేరలోని మర్రిచెట్టు ప్రాంతం మెస్రం వంశీయులతో సందడిగా మారింది. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
