పోస్ట్ చేయబడింది జనవరి 17, 2026 2:26PM

ఇటీవల నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కొరినా మచాడో.. వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ తనకొచ్చిన బహుమతిని అధ్యక్షుడు ట్రంప్ కి అందించి.. తనదైన ఉదారత చాటుకున్నారు. దీనితో ఎట్ట కేలకు నోబెల్ బహుమతి నాకే.. అంటూ ట్రంప్ పేరుతో పలు కామెంట్లు సెటైర్లు వెలువడుతున్నాయ్.
ఇంతకీ నోబెల్ నిబంధన’లు ఏం చెబుతున్నాయో చూస్తే బహుమ’తి ఒక్కసారి క’మిటీ ప్రధానం చేస్తే.. అందులో మరోమార్పు ఉండదు. అవి ఆయా వ్యక్తుల పేరుతో మాత్రమే లిఖించబడతాయి. వారు మాత్రమే ఆయా విభాగాల విజేతలుగా పరిగనించబడతారు. ఇది ఇవాళ్టి నియమ- నిబంధన కాదు.. అల్ ఫ్రెడ్ నోబెల్ పేరుతో ఈ అవార్డులు ఇవ్వడడం నుంచీ మొదలైన ఒకానొక ఆచారం.
అయితే ఆయా’లకు తమకొచ్చిన బహుమతి ద్వారా వచ్చిన విజేత.. ఎవరికైనా ఇవ్వొచ్చు. మరేదైనా చారిటీకి సమర్పించుకోవచ్చు. ప్రస్తుతం మచాడోకి 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు బహుమతితో పాటు ఇచ్చారు. ఇది భారతీయ కరెన్సీలో చెబితే సుమారు 10 కోట్ల మేర ఉంటుంది. ఈ మొత్తం ఆమె ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు దానం చేయవచ్చు. అది ఆమె ఇష్టం. అయితే ఆ అవార్డు భౌతికంగా ఎవరి చెంత ఉన్నా కూడా విజేత మాత్రం మచాడోనే.
ఆ బహుమతిని క’మిటీ ఫలానా వారి పేరుతో రాసి వారికిస్తే ఇక వారికే సొంతం. దాని బదిలీ చేయుటకు ఎంత మాత్రం వీలు కాదు. ఈ లెక్కన ఈ బహుమతిని గ్రహీత నుంచి తీసుకున్నంత మాత్రాన దాని విలువ పెరగదు- తరగదు, బదిలీ అంతకన్నా కాదని చెబుతున్నాయి నార్వేజియన్‌బెల్ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
దానికి తోడు దేశాలకు దేశాలు ఆక్రమించే కుయుక్తులు వేస్తున్న ట్రంప్ నకు నోబెల్ శాంతి బహుమతికాదు కదా.. ఆ పేరు ఎత్తడానికే అనర్హుడిగా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్ అట్టుడుకుతోందంటే అందుకు ప్రధాన కారకుడు ట్రాంపే. ఇక వెనుజువెల సంగతి సరే సరి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఇంతటి విచ్చిత్తికి కారకుడవుతోన్న ట్రంప్ చేతికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం కూడా నేరమే అన్న మాట వినిపిస్తోంది.
వెనుజువెల ప్రతిపక్ష నేత మచాడో ఈ పని ఎందుకు చేశారో అన్న చర్చకు సైతం తెరలేచింది. బహుశా ట్రంప్ తనకు మచాడో నోబెల్ బహుమతి ఇచ్చినందుకు ఆమెనే ఆ దేశ తర్వాతి అధ్యక్షురాలిగా నియమిస్తారా? అలాగైతే మచాడోకి ఇచ్చిన శాంతి బహుమానం కూడా కళంకితం అవుతుంది కదా? అన్న మాట కూడా వినిపిస్తోంది.
