పోస్ట్ చేయబడింది జనవరి 17, 2026 7:01PM

సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదన్నారు. ఈ వేదికపై ఉన్నవాళ్లంతా నా ఓటమికి గట్టిగా పనిచేశారు. అయిన అవేమీ పట్టించుకోకుండా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తానని చెప్పారు.
కేంద్రం సహకారం అందించిన డీకే అరుణ ఏర్పాటు. కేంద్రం, రాష్ట్ర నిధులు కలిసి ఉపయోగించుకోవాలని ఆమె స్ఫష్టం చేశారు. పాలమూరు అభివృద్ధి బాధ్యత సీఎం రేవంత్‌దే అన్నారు. ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి రేవంత్‌రెడ్డి భూమి పూజ చేశారు.
.webp)