Home Latest News కడపను తాకిన కోస్తా కోడి కత్తి…కొక్కరోకో అంటున్న కోడిపందాలు | కోడి పందేలు| భీమవరం| అమలాపురం| కడప| కోడిపందాలు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ – Andhra Waves

కడపను తాకిన కోస్తా కోడి కత్తి…కొక్కరోకో అంటున్న కోడిపందాలు | కోడి పందేలు| భీమవరం| అమలాపురం| కడప| కోడిపందాలు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
కడపను తాకిన కోస్తా కోడి కత్తి...కొక్కరోకో అంటున్న కోడిపందాలు | కోడి పందేలు| భీమవరం| అమలాపురం| కడప| కోడిపందాలు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ


జనవరి 15, 2026 1:55PMన పోస్ట్ చేయబడింది


కోడిపందేలు అంటే కోస్తా గుర్తుకొస్తుంది. పందెం రాయులు తెలుగు రాష్ట్రాలనుంచి అక్కడికి చేరుకొని సంక్రాంతి కోడిపందేలతో జోష్ మీద ఉంటారు…ఈ సారి కోస్తా కోడి కత్తి కడపకు చేరింది. భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి. లక్షలకు లక్షల పందేలు తో సంక్రాంతి రోజున కోళ్ళ పందేలు జోరుగా జరిగాయి.

కోడిపందేలు ఆడకుండా చర్యలు తీసుకోవాలని కోర్టులు చెప్పినా , కోడిపందాలు ఉండకూడదన్న నిభందనలున్నా పలుచోట్ల కోడి కత్తులు ఆడాయి.ఈ ప్రాంతంలో సుశిక్షితులైన పందె ఆర్గనైజర్లు లేక పోవడంతో కొందరు కోస్తా నుంచి ఆర్గనైజర్లను రప్పించి నట్లు సమాచారం. గతంలో జిల్లాలో ఎప్పుడు లేని విధంగా కోడిపందాలు ఆడటం ,పందెం రాయులు, వాటి తిలకించేందుకు వచ్చే వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జిల్లాలో ఆసక్తికరంగా మారింది.

*నేతలే అండగా !

ఉమ్మడి కడప జిల్లాలో యధేచ్చగా కోడి పందేలు సాగాయి. అధికార నేతల అండతో ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి మరీ కోడి పందేలు నిర్వహించారు.పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో, పులివెందులలో కోడిపందాలు టిడిపి నేతలను ప్రారంభించడం విశేషం.పులివెందుల నియోజక వర్గంలో వేంపల్లి, లింగాలలో కోడిపుంజులు కాలు దువ్వాయి.

లింగాల మండలం దొండ్ల వాగులో భీమవరం నుంచి ఆర్గనైజర్లతో కోడి పందేలు ఆడినట్లు సమాచారం. కొన్ని చోట్ల పందేలతో పాటు ఇతర ఆటలు ఆడించినట్లు తెలుస్తోంది.వేముల మండలం భూమయ పల్లె, పార్నపల్లి,అలవలపాడు, పాములూరు, ఎర్రబెల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు జరిగాయి.రాజంపేట అత్తిరాల అమగంపల్లె, పుల్లంపేట మండలాల్లో జోరుగా కోడిపందాలు జరిగాయి.

*ఆటగాళ్ళు కు సహాయాలు.

దవాఖానకు సకల సౌకర్యాలు కల్పించారు. ఒక్కో ఆట రెండు నుంచి ఐదు లక్షలు పలికినట్లు. తాడిపత్రి కదిరి తదితర ప్రాంతాల నుంచి పులివెందుల, రాజంపేటలకు పందెం కాసేవారు, జూదరులు రావడం జరిగింది..సంక్రాంతి ఆటవిడుపు గా అని చెబుతున్న నేతలు పండుగ సంబరాల మాటున కోస్తాకు దీటుగా మొత్తం కోడి పందేలు నిర్వహించడం కడప జిల్లాలో సంక్రాంతి కోడి పందేలను తరిమికొట్టింది.

*పోలీసు ఆంక్షలను లెక్క పెట్టకుండా

పోలీసు ఆంక్షలను లెక్క చేయని పందెం రాయుళ్లు యదేచ్చగా ఆటసాగించారు. కొన్ని చోట్ల కోళ్ల పందేలు ప్రత్యేక వీడియో షూట్ చేసి మరీ ఆడించడం జరిగింది.

*పోలీసుల దాడులు

కోస్తా బరుల కు తీసిపోని రీతిలో కోడి పందేలు జరగడంతో వీటిపై పోలీసులు దాడులు చేశారు.
కొండాపురం మండలం ఓబన్న పేట గ్రామ పొలాల్లో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు అరెస్టు చేశారు. టీ.కోడూరు కోడి పందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురు అరెస్టు చేశారు. మొత్తంగా జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో కోడిపందాలు జరగడం లేదు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird