పోస్ట్ చేయబడింది జనవరి 13, 2026 4:10PM

మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని కొన్ని న్యూస్ ఛానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా అవమానకరమైన, అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేయడం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఈ రెండు కేసులనూ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనితో లోతైన దర్యాప్తునకు డీజీపీ శివధర్ రెడ్డి 8 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కావలి వెంకటేశ్ అనే వ్యక్తిపై కాంగ్రెస్ నేత గుళ్ల నరసింహ ఫిర్యాదు మేరకు నారాయణపేట జిల్లాలో కేసు నమోదైంది. మరోవైపు, ఓ మహిళా ఐఎస్ అధికారిణికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ రెండు న్యూస్ చానెళ్లతో పాటు పలు యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ రెండు కేసులనూ సిట్ దర్యాప్తు చేయనుంది.
.webp)