
ఇటీవల సినిమాల ఫేక్ కలెక్షన్ పోస్టర్స్, బుక్ మై షో ఫేక్ రేటింగ్స్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ఆయన నిర్మించిన ‘నారీ నారీ నడుమ మురారి'(నారీ నారీ నడుమ మురారి) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఈ రెండు విషయాలపై స్పందించారు.
“కలెక్షన్ పోస్టర్స్ రిలీజ్ చేయడం నిర్మాతల వ్యక్తిగతం. నా వరకు నేను ఎప్పుడో ఆపేశాను. ఎవరికి వాళ్ళు ఆపేస్తారు. ఒకప్పుడు ప్రెజర్ ఉండేది. దానిని ఒక పబ్లిసిటీ స్టంట్ మాకు తీసుకునేవాళ్ళం. గ్రాస్ కి, షేర్ కి తేడా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. దూకుడు సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని పోస్టర్ వేశాం. అది మీకు వంద కోట్లు వచ్చేశాం. ఆడియన్స్ ఆ నెంబర్ చూసి అట్రాక్ట్ అవుతారు కదా.. అయితే ఇప్పుడు మిస్ ఫైర్ అవుతుంది. అనిల్ కలెక్షన్ పోస్టర్స్ పై అనిల్ సుంకర తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఇది కూడా చదవండి: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
బుక్ మై షోలో రివ్యూలు, రేటింగ్ లపై కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడంపై అనిల్ సుంకర సూచన.. “బుక్ మై షో వంటి యాప్స్ లో లైక్స్, రేటింగ్స్ కావాలంటే డబ్బులు కట్టాలి. రేటింగ్ కావాలంటే ఇంత ప్యాకేజ్ తీసుకోవాలి అనే లెక్కలు ఉంటాయి. అది వాళ్ళ బిజినెస్. అన్నారు.
