
-మన శంకర వరప్రసాద్ గారికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్
-అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిమాండ్
-ఫ్యాన్స్ మాట అల్లు అర్జున్ వింటాడా
-అనిల్ రావిపూడి నెక్స్ట్ హీరో ఎవరు
వరల్డ్ వైడ్ గా నిన్న ప్రీమియర్స్ తో అడుగుపెట్టిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (మన శంకర వరప్రసాద్ గారు)పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నాడు. మెగా, విక్టరీ కాంబోలో వచ్చిన సీన్స్‌తో పాటు నయనతార(నయనతార), చిరంజీవి మధ్య కెమిస్ట్రీ, కామెడీ సీన్స్, చైల్డ్ సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్ ఇలా చెప్పుకుంటూ పోతే టోటల్ గా దర్శకుడు అనిల్ రావిపూడి పనితనంపై మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి(చిరంజీవి)కి అభిమానులు, ప్రేక్షకుల్లో ఉన్న మాస్ ఇమేజ్ ని ఏ మాత్రం తగ్గించకుండా చిరంజీవి క్యారక్టర్ ని ఎంటర్ టైన్ కోణంలో కూడా ఉపయోగించుకున్న విధానానికి ప్రతి ఒక్కరు ఎంతగానో ఫిదా అవుతున్నారు. కొంత మంది హీరోల అభిమానులు అయితే తమ అభిమాన హీరో అనిల్ రావిపూడి(అనిల్ రావిపూడి) మార్క్ తో సంక్రాంతి సినిమాతో తమ ముందుకు రావాలని కోరుకుంటున్నారు.
అలా అభిమానుల్లో ఐకాన్ స్టార్ ‘అల్లుఅర్జున్'(అల్లు అర్జున్)అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇండియా ‘అల్లు అర్జున్ పాన్ సినిమాల్లోనే కాకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లోను చెయ్యాలి. ఇప్పటికే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్ లో అల వైకుంఠపురం లాంటి సినిమా చేసి రికార్డు కలెక్షన్స్ తో తన సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తో ఒక సినిమా చెయ్యాలి. పుష్ప 2 తర్వాత తక్కువ బడ్జెట్ లో ఒక సినిమా చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ సినిమా అనిల్ రావిపూడి తోనే చెయ్యాలి. ఆ కాంబో సెట్ అయితే రికార్డులకి కొత్త పేరు కనిపెట్టే రికార్డులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏంటి పరిస్థితి!.. మన శంకర వర ప్రసాద్ గారికి హిట్ టాక్ వినపడుతుంది
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(అట్లీ)తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుండగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. 2024లో అల్లు అర్జున్ పుష్ప 2 తో పాన్ ఇండియా వ్యాప్తంగా సత్తా చాటిన విషయం తెలిసిందే. అంటే మూడేళ్ళకి అట్లీ మూవీ తో వస్తాడు. మరి అంత గ్యాప్ అనేది లేకుండా అట్లీ మూవీ కంప్లీట్ అయ్యాక అయినా అభిమానుల మాట విని అనిల్ రావిపూడి తో సినిమా చేస్తాడేమో చూడాలి.
