Home Latest News తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే! | తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తులు లేవు. మున్సిపల్| ఎన్నికలు| పోటీ – Andhra Waves

తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే! | తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తులు లేవు. మున్సిపల్| ఎన్నికలు| పోటీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే! | తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తులు లేవు. మున్సిపల్| ఎన్నికలు| పోటీ


జనవరి 12, 2026 9:04AMన పోస్ట్ చేయబడింది


తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ జరగనుంది. అయితే ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన ఎన్డీయేతో తెలంగాణ ఎన్నికలలో పొత్త ప్రశక్తే లేదని తెలంగాణ బీజేపీ ప్రకటించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

సహజంగానే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ అనగానే బీజేపీతో పొత్తు ఉంటుందని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన బిజెపి, టిడిపిలతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే తెలంగాణలో కూడా అదే కూటమి కొనసాగుతుందని అంతా భావించారు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తు లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని కుండబద్దలు కొట్టారు. రామచంద్రరావు ప్రకటనకు కొద్ది సేపు ముందే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ ప్రకటించారు.

దీంతో రాజకీయ వర్గాల్లో పొత్తులపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. అయితే ఎన్డీఏ తరహా కూటమి కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమనీ, ఇది తెలంగాణలో కొనసాగే అవకాశం లేదనీ రామచంద్రరావు ప్రకటనతో తేటతెల్లమైంది. ఇందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడి రగులుతున్న జలవివాదాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ జలవివాదాల కారణంగానే.. ఆంధ్రప్రదేశ్‌లో సన్నిహిత సమన్వయం ఉంటుందని, తెలంగాణలో పార్టీల మధ్య పొత్తుకు అవకాశం లేదని అంటున్నారు. ఆ కారణంగానే తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు మునిసిపల్ ఎన్నికలలో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగాల్సిన అనివార్యత ఏర్పడిందని అంటున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird