Home Latest News బెజవాడ నడిబొడ్డులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ | సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ| బెజవాడ| మంత్రి కొల్లు రవీంద్ర| రఘురామ కృష్ణం రాజు| ఎంపీ కేశినేని శివనాథ్| జై కృష్ణ| హీరో మహేష్ బాబు – Andhra Waves

బెజవాడ నడిబొడ్డులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ | సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ| బెజవాడ| మంత్రి కొల్లు రవీంద్ర| రఘురామ కృష్ణం రాజు| ఎంపీ కేశినేని శివనాథ్| జై కృష్ణ| హీరో మహేష్ బాబు – Andhra Waves

by andhra andhrawave
0 comments
బెజవాడ నడిబొడ్డులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ | సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ| బెజవాడ| మంత్రి కొల్లు రవీంద్ర| రఘురామ కృష్ణం రాజు| ఎంపీ కేశినేని శివనాథ్| జై కృష్ణ| హీరో మహేష్ బాబు


జనవరి 11, 2026 3:25PMన పోస్ట్ చేయబడింది


విజయవాడ లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, హీరో జయ కృష్ణ, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బుద్ధ వెంకన్న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు.

కృష్ణని చూస్తే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంటారని, విజయవాడ నదిబొడ్డులో కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని. తెలుగుజాతి ఉన్నంతవరకు కృష్ణ పేరు నిలిచి ఉంటుందన్నారు. కృష్ణతో ప్రతి ఒక్క హీరోకి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పారు. మూవీ పోస్టర్‌ను చూసి ఆయా సినిమాలకు వెళ్లమంటే అది ఒక కృష్ణకే దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. హీరో కృష్ణను మించిన సూపర్ స్టార్ మరొకరు ఉండరని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఉన్నారు.

అతి తక్కువ కాలంలో 350 సినిమాలు చేసిన గొప్ప నటుడు కృష్ణ అని ప్రశంసించారు. మూడో తరం వారసుడిగా రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ వస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ బ్యానర్‌లో జై కృష్ణ నటించడం చాలా సంతోషంగా ఉంది రఘురామ కృష్ణంరాజు. కృష్ణకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నటుడు మహేశ్‌బాబు లాగే.. కృష్ణ మనువడు జై కృష్ణ కూడా సూపర్ స్టార్ తరహాలో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. ఈనాడు సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది గుర్తుచేశారు. ఈనాడు సినిమా ద్వారా కృష్ణ రాష్ట్ర రాజకీయాల చరిత్రనే మార్చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird