పోస్ట్ చేయబడింది జనవరి 10, 2026 3:38PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం వేద పండితులచే అమ్మవారికి పూజలు చేశారు. ఈ నెల 12న ఇస్రో ఎస్‌ఎస్‌ఎల్వీ- సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్ధించినట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఇస్రో చైర్మన్ నారాయణన్‌ను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వి. నారాయణన్ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం 12.19 గంటలకు ప్రారంభమౌతుంది. ఆ మరుసటి రోజు అంటే సోమవారం (జనవరి 12 )ఉదయం 10.19 గంటలకు పీఎస్‌ఎల్‌వి -సి62 రాకెట్ ద్వారా ఈఓఎస్ -ఎన్1 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టింది.
