Home Latest News ఎక్కువగా చలిగా అనిపిస్తూ ఉంటుందా.. ఇదే అసలు కారణం! | జలుబు అసహనానికి కారణాలు లేదా ఎల్లప్పుడూ చలి అనుభూతి| ఎందుకు అన్ని వేళలా చల్లగా అనిపిస్తుంది| జలుబు అసహనానికి కారణాలు మరియు వెచ్చగా ఉండడం ఎలా| రాత్రి అకస్మాత్తుగా చలి ఎందుకు అనిపిస్తుంది – Andhra Waves

ఎక్కువగా చలిగా అనిపిస్తూ ఉంటుందా.. ఇదే అసలు కారణం! | జలుబు అసహనానికి కారణాలు లేదా ఎల్లప్పుడూ చలి అనుభూతి| ఎందుకు అన్ని వేళలా చల్లగా అనిపిస్తుంది| జలుబు అసహనానికి కారణాలు మరియు వెచ్చగా ఉండడం ఎలా| రాత్రి అకస్మాత్తుగా చలి ఎందుకు అనిపిస్తుంది – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఎక్కువగా చలిగా అనిపిస్తూ ఉంటుందా.. ఇదే అసలు కారణం! | జలుబు అసహనానికి కారణాలు లేదా ఎల్లప్పుడూ చలి అనుభూతి| ఎందుకు అన్ని వేళలా చల్లగా అనిపిస్తుంది| జలుబు అసహనానికి కారణాలు మరియు వెచ్చగా ఉండడం ఎలా| రాత్రి అకస్మాత్తుగా చలి ఎందుకు అనిపిస్తుంది


పోస్ట్ చేయబడింది జనవరి 9, 2026 2:43PM


చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు ధరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..

మానవ శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రతను అనుబంధమైన థర్మోర్గ్యులేషన్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రతి శరీరం దానికదే నిర్వహించబడుతుంది. దీనికి నిర్దిష్ట విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఈ పోషకాలు లోపించినప్పుడు రక్త ప్రసరణ ప్రభావితం అవుతుంది, జీవక్రియ మందగిస్తుంది. దీని వలన శరీరానికి తగినంత వేడిని ఉత్పత్తి చేయకపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే మనిషిలో సాధారణం కంటే చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది చాలా వరకు రక్తహీనత లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో వేడిగా ఉండటానికి ఇంటి వాతావరణాన్ని వెచ్చగా ఉంచడం కంటే తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్ని పోషకాలు కూడా చలి ఎక్కువ కలగడానికి కారణం అవుతాయట.

ఐరన్, విటమిన్-బి12 లోపం..

చాలా చల్లగా అనిపించడానికి అత్యంత సాధారణ కారణం ఐరన్ లోపమాట. ఐరన్ బాగుంటేనే హిమోగ్లోబిన్‌ మెరుగ్గా ఉంటుంది. ఇది కంటికి ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. అదే ఐరన్ లోపిస్తే ఆక్సిజన్ సరఫరా లోపించి చలిడానికి దారి తీస్తుంది.

విటమిన్ బి12 లోపం నరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చేతులు, కాళ్ళు తిమ్మిరిగా ఉండటం, చల్లగా ఉండటం జరుగుతుంది. మెగ్నీషియం, ఫోలెట్ కూడా కండరాల సంకోచం, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే..

అకస్మాత్తుగా చాలా చలిగా అనిపిస్తే కాస్త వ్యాయామం చేయడం మంచిది. లేదంటే శరీరాన్ని సాగదీయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. శారీరక శ్రమ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది శరీరాన్ని వెంటనే వేడి చేస్తుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా అల్లం టీ తాగవచ్చు. అయితే అల్లం టీ ఖాళీ కడుపుతో తాగకూడదు.

ఆహారంలో మార్పులు..

శరీరం వెచ్చగా ఉండటానికి ఆహారంలో బెల్లం, వేరుశనగ, ఖర్జూరం, మిల్లెట్ వంటి వెచ్చని ఆహారాలను చేర్చుకోవాలి. వెల్లుల్లి, అల్లం తీసుకోవడం పెంచాలి. ఇవి రక్త నాళాలను విస్తరిస్తాయి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఆహారం తీసుకున్నప్పటికీ సమస్య కొనసాగితే, సంప్రదించి, వైద్యుల సలహా మేరకు మందులు లేదా చికిత్స తీసుకోవడం మంచిది.

*రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించబడ్డాయి. వారి ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird