Home సినిమా బహిరంగంగా వేలం వేసి అప్పులు తీర్చండి.. హైకోర్టు సంచలన తీర్పు – Andhra Waves

బహిరంగంగా వేలం వేసి అప్పులు తీర్చండి.. హైకోర్టు సంచలన తీర్పు – Andhra Waves

by
0 comments
బహిరంగంగా వేలం వేసి అప్పులు తీర్చండి.. హైకోర్టు సంచలన తీర్పు




-సినీ చరిత్రలో ఇదే తొలి తీర్పా!
-కోర్టు తీర్పు వెనక మర్మం ఏంటి!
-కార్తీ అభిమానులు ఏమంటున్నారు

తమిళ, తెలుగు నాట సమానమైన ఫాలోయింగ్ కలిగిన కార్తీ ‘వా వాటియార్'( Vaa vaathiyaar)అనే మూవీని కంప్లీట్ చేసి అభిమానుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలుగు టైటిల్ ‘అన్నగారు వస్తున్నారు’. డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా, చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా 2011లో ఒక మూవీకి సంబంధించి అర్జున్ లాల్ సుందర్‌దాస్ అనే ఫైనాన్సియర్ నుండి 10.35 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఆ అమౌంట్ వడ్డీతో కలిపి దాదాపుగా 21.78 కోట్ల రూపాయలకి చేరింది. దీంతో అర్జున్ లాల్ చెన్నైలోని హైకోర్టులో జ్ఞానవేల్ రాజా పై పిటిషన్ వేశారు. సదరు పిటిషన్ లో తనకి రావాల్సిన అమౌంట్ చెల్లించే వరకు వాతియార్ రిలీజ్ ని నిలిపివేయాలని కోరాడు. దీంతో వాతియార్ రిలీజ్ పై కోర్టు స్టే విధించింది. స్టే ఆర్డర్‌ని సవాలు చేస్తూ జ్ఞానవేల్ రాజా సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేదు. రీసెంట్ గా హైకోర్టు వాతియార్ విషయంలో ఎవరు ఊహించని విధంగా సరికొత్త తీర్పు వెలువడింది.

జ్ఞానవేల్ రాజా చెల్లించాల్సిన 21.78 కోట్ల రూపాయల ఫైనాన్షియర్‌కి తిరిగి చెల్లించడానికి, వా వాటియార్ హక్కులను బహిరంగంగా వేలం వేయాలని మద్రాస్ ఆదేశించింది.
గతంలో ఫైనాన్సియల్ ఇష్యూ తలెత్తడంతో చాలా సినిమాలు కోర్టు గుమ్మం ఎక్కాయి. కానీ సినిమా హక్కులను బహిరంగంగా వేలం వేసి ఫైనాన్సియర్ కి అమౌంట్ ఇవ్వాలని చెప్పడం బహుశా ఇదే తొలి సారి ఏమో. అదే విధంగా తన కోర్టు తీర్పులో బకాయిలు చెల్లించే వరకు, OTT మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, థియేటర్లలో సినిమా విడుదలని కోర్టు శాశ్వతంగా నిలిపివేసినట్లు కూడా హై కోర్టు తన తీర్పులో విడుదలైంది. ఈ తీర్పుతో కార్తీ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.


ఇది కూడా చదవండి: రాజా సాబ్: ది రాజాసాబ్ మూవీ రివ్యూ

వా వాటియార్ లో కార్తీ డిఎస్ పి రామేశ్వరన్ గా కనిపిస్తుండగా, కార్తీ(karthi)సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi shetty)జత కట్టింది. సత్యరాజ్, రాజ్ కిరణ్, కరుణాకరణ్ ముఖ్యమైన క్యారెక్టర్లను పోషించాడు. నలన్ కుమారస్వామి(Nalan Kumaraswami)దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా(కే జ్ఞానవేల్ రాజా)సుమారు 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టుగా టాక్. కార్తీకి జ్ఞానవేల్ రాజా సోదరుడి వరుస అవుతాడు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird