Home Latest News కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే? | కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్త్| ఎవరు| టీడీపీ| జనసేన| అనేక – Andhra Waves

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే? | కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్త్| ఎవరు| టీడీపీ| జనసేన| అనేక – Andhra Waves

by andhra andhrawave
0 comments
కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే? | కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్త్| ఎవరు| టీడీపీ| జనసేన| అనేక


జనవరి 8, 2026 10:28AMన పోస్ట్ చేయబడింది


కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు కూడా డిమాండ్ చేశారు.

ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభించింది.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కొన్ని ఈక్వేషన్ల ప్రకారం రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అదాలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నారు. జనసేన ఇద్దరిలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో?



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird