Home Latest News బతికున్న గొర్రె–మేకల రక్తంతో అక్రమ వ్యాపారం | హైదరాబాద్| గొర్రెలు| మేక| దిగుమతి|ఎగుమతి| రక్తం| అక్రమ వ్యాపారం| కాచిగూడ| రాష్ట్ర ఔషధ నియంత్రణ| సీఎం రేవంత్ రెడ్డి| నేర వార్తలు| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

బతికున్న గొర్రె–మేకల రక్తంతో అక్రమ వ్యాపారం | హైదరాబాద్| గొర్రెలు| మేక| దిగుమతి|ఎగుమతి| రక్తం| అక్రమ వ్యాపారం| కాచిగూడ| రాష్ట్ర ఔషధ నియంత్రణ| సీఎం రేవంత్ రెడ్డి| నేర వార్తలు| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
బతికున్న గొర్రె–మేకల రక్తంతో అక్రమ వ్యాపారం | హైదరాబాద్| గొర్రెలు| మేక| దిగుమతి|ఎగుమతి| రక్తం| అక్రమ వ్యాపారం| కాచిగూడ| రాష్ట్ర ఔషధ నియంత్రణ| సీఎం రేవంత్ రెడ్డి| నేర వార్తలు| డీజీపీ శివధర్ రెడ్డి


పోస్ట్ చేయబడింది జనవరి 7, 2026 4:24PM


హైదరాబాద్ నగరంలో బతికేస్తున్న మేకల నుండి గొర్రెలను సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. జంతు హింసతో పాటు డ్రగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని ఒక ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ కంపెనీపై విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించబడ్డాయి, భారీగా రక్త నిల్వలు బయటపడ్డాయి.

కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు, హైదరాబాద్ పోలీసులు, స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడలోని CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీపై ఆకస్మిక సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో అధికారుల కంటపడిన దృశ్యాలు విస్మయానికి గురి చేశాయి. గోదాములలో ప్యాకెట్ల రూపంలో భారీగా గొర్రె, మేక రక్తాన్ని నిల్వ చేసి ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు వెయ్యి లీటర్లకు పైగా రక్తాన్ని ప్యాకెట్లలో భద్రపరిచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ రక్తాన్ని నిల్వ చేయడం, తరలించడం పూర్తిగా అక్రమమని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. రక్తానికి సంబంధించిన అన్ని ప్యాకెట్లను సీజ్ చేశారు.

ప్రాథమిక దర్యాప్తులో ఈ రక్తాన్ని హర్యానాలోని పాలీ మెడికూర్ అనే కంపెనీకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ పేరుతో రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ, ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అసలు గొర్రె, మేకల రక్తాన్ని ఏ అవసరానికి వినియోగిస్తున్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే, ఈ రక్తాన్ని ట్రయల్, ఔషధ తయారీ లేదా బయో-మెడికల్ ప్రయోగాల కోసం అక్రమంగా ఉపయోగిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన పత్రాలు, లైసెన్సులు ఏవీ కంపెనీ వద్ద లభించలేదు. CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని నికేశ్ పరారీలో ఉన్నాడు. గత రెండు రోజులుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నికేష్‌ను అదుపులోకి తీసుకుంటే రక్తం సేకరణ, నిల్వ, సరఫరా వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కీసర ప్రాంతంలోని నిర్మానుష ప్రాంతాల గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని శేఖరిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం లభించింది. ఎలాంటి వెటర్నరీ పర్యవేక్షణ లేకుండా, జంతువులకు తీవ్ర హింస చేస్తూ ఈ రక్తాన్ని సేకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది జంతు సంక్షేమ చట్టాలకు పూర్తి విరుద్ధమని అధికారులు చెబుతున్నారు

ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో కేంద్ర డ్రగ్ కంట్రోల్‌తో పాటు ఇతర కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, జంతు హింస నిరోధక చట్టం, అక్రమ రవాణా నిబంధనల కింద కేసులు నమోదు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ అక్రమ రక్త వ్యాపారం వెనుక మరిన్ని కంపెనీలు, వ్యక్తులు ఉన్నారా? ఎక్కడెక్కడికి ఈ రక్తాన్ని సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసా గుతోంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాదు నగరంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో జంతు ప్రియులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు… అసలు ఈ రక్తంతో ఏం చేశారనే పూర్తి వివరాలు నిందితుల అరెస్టులతోనే వెలుగులోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird