Home సినిమా సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! – Andhra Waves

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! – Andhra Waves

by
0 comments
సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట!



-జన నాయకుని చూసి ఎవరు భయపడతారు!
-ఎందుకు భయం
-అసలు సినిమా ఏం ఇచ్చింది! ఏం చేసింది
-విజయ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తి ఉందో ‘కళ’ కి అంతే శక్తి ఉంది. ఈ కళ నుంచి సినిమా(సినిమా)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే నటుడ్ని అయితే సూపర్ హీరోగా చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయకన్(జన నాయకన్)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతూ తాజా సినిమా గొప్పతనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.

సినిమా ఇచ్చిన శక్తి ద్వారానే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ‘తమిళగ వెట్రి కజగం'(TVK)అనే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. దీనితో విజయ్ సినిమాలకి ఉండే జాతర ఈ సారి జన నాయకుని ద్వారా మరింత ఎక్కువగా మారింది. దీనికి ప్రధాన కారణం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అదిరోహించి ప్రజలకి సేవ చేయడం కోసం జన నాయకన్ తన ఆఖరి మూవీ అని విజయ్ ప్రకటించడం. ట్రైలర్ ద్వారా రాజకీయ అంశాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో విజయ్ కొంత మంది రాజకీయాలను కొడుతు ప్రజలకి మంచి చెయ్యడానికి రాజకీయాల్లో ఉండమంటే దోపిడీలు, హత్యలు చేస్తారా అంటాడు. ఇందులో కొంత మంది డిఎంకే తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో ఉన్న థియేటర్స్ కి జన నాయకన్ ప్రదర్శించడానికి వీల్లేదని బెదిరిస్తున్నట్టుగా వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: రాజా సాబ్ బ్రేక్ ఎవెన్యూ అవ్వాలంటే రావాల్సింది ఇదేనా! ఫ్యాన్స్ ఏమంటున్నారు

దీనితో సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులు సూచించిన జన నాయకన్ విజయ్ ప్రభంజనంలో డిఎంకె ఎక్కడ కొట్టుకుపోతుందో అని ఆ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు భయపడుతున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. మూవీ లవర్స్, సినీ విశ్లేషకులు కూడా స్పందిస్తున్నారు జన నాయకన్ తో విజయ్ మరోసారి సినిమాకి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పాడని అంటున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird