Home Latest News అమెరికా అభియోగాలు పచ్చి అబద్ధాలు.న్యూయార్క్ కోర్టులో మదురో వాదన | అమెరికా ఆరోపణలు పచ్చి అబద్ధాలు| venijuvela| అధ్యక్షుడు| మదురో| చెప్పారు| సమాఖ్య| కోర్టు – Andhra Waves

అమెరికా అభియోగాలు పచ్చి అబద్ధాలు.న్యూయార్క్ కోర్టులో మదురో వాదన | అమెరికా ఆరోపణలు పచ్చి అబద్ధాలు| venijuvela| అధ్యక్షుడు| మదురో| చెప్పారు| సమాఖ్య| కోర్టు – Andhra Waves

by andhra andhrawave
0 comments
అమెరికా అభియోగాలు పచ్చి అబద్ధాలు.న్యూయార్క్ కోర్టులో మదురో వాదన | అమెరికా ఆరోపణలు పచ్చి అబద్ధాలు| venijuvela| అధ్యక్షుడు| మదురో| చెప్పారు| సమాఖ్య| కోర్టు


జనవరి 6, 2026 9:11AMన పోస్ట్ చేయబడింది


వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా మెరుపుదాడి నిర్వహించి అరెస్టు చేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మదురో అరెస్టు వ్యవహారం వెనుక డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన కారణాలు ఉన్నట్లు గుర్తించారు అమెరికా ఆయనను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచింది. అయితే మదురో తాను నిర్దోషినని కోర్టులో వాదించారు. వెనిజువేలా రాజథాని కారకస్‌లోని అధ్యక్ష భవనం నుంచి తనను బలవంతంగా బందీగా పట్టుకున్నారని మదురో కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు.

తాను అత్యంతనీయ గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తిననీ, దేశాధ్యక్షుడిననీ మదురో అమెరికా మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు. అమెరికా అక్రమంగా తనను పదవి నుంచి తొలగించినా, తానే ఇప్పటికీ వెనిజువేలా అధ్యక్షుడిని అని ఆయన ఉద్ఘాటించారు. మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను కూడా కోర్టులో హాజరుపరిచారు. ఆమె కూడా తాను వెనిజుల ప్రథమ మహిళనని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. అమెరికా మదురోపై నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతికి కుట్ర, విధ్వంసకర ఆయుధాలు కలిగి ఉండటం, మెక్సికోలోని సినలోవా, జెటాస్ కార్టెల్స్, కొలంబియా తిరుగుబాటుదారులతో కలిసి డ్రగ్స్ నెట్‌వర్క్ నడపడం వంటి అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వెనిజువెల చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఈ తప్పుడు కేసులు పెట్టకుండా మదురో వాదించారు.

ఇలా మదురో అరెస్ట్ తర్వాత వెనిజువెలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా, చైనా సహా వెనిజువెలా మిత్రదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 1989 పనామా దాడి తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా చేసిన అతిపెద్ద సైనిక చర్యగా దీనిని గుర్తించారు.

అదాలా ఉంటే.. వెనిజువేలా అరెస్టు తరువాత ఆ దేశంలో యుద్ధ వాతావరణం. తాజాగా అక్కడి అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు, ఘర్షణలు జరిగాయి. మదురోను అమె రికా బందీగా పట్టుకుని తరలించిన తరువాత ఆ దేశ సుప్రీం కోర్టు ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్‌రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టింది. పదవీ బాధ్యతలు ప్రకటించిన వెంటనే ఆమె అమెరికాతో చర్చలకు సిద్ధమని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. వెనిజువెలాలో సక్రమంగా అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని తెలుస్తుంది. కాగా వెనిజువేలలో పరిణామాలపై భారత్ ఆచితూచి స్పందించింది. వెనిజువేలా ప్రజల క్షేమం తమకు ముఖ్యమని, అన్ని శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird