పోస్ట్ చేయబడింది జనవరి 5, 2026 7:57PM

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ భారీ రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక పరిణామం జరిగింది. సాహితీ స్కాంపై సీసీఎస్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ స్కాంలో మొత్తం రూ.3000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు సీసీఎస్ పోలీసులు తేల్చారు. ఈ కంపెనీ ఎండి సాహితీ లక్ష్మీనారాయణ ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో ప్రజలను ఆకర్షించి, అతి తక్కువ ధరలకు ప్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సాహితీ లక్ష్మీనారాయణను పోలీసులు గుర్తించారు. ఈ సాహితీ స్కాం పై మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. సాహితీ స్కాంలో ఇప్పటివరకు మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ఈ 64 కేసులపై సీసీఎస్ ప్రత్యేక బృందం విచారణ కొనసా గుతోంది. ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అత్యధికంగా మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ప్రాజెక్ట్ పేరుతోనే రూ.500 కోట్లు వసూలు చేసినట్లు సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. శర్వాణి ఎలైట్‌కు సంబం ధించిన 17 కేసులు నమోదు కాగా, ఈ 17 కేసులపై ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను ప్రాజెక్టుల కోసం వినియోగించకుండా, సాహితీ లక్ష్మీనారా యణ తన సొంత ప్రయోజ నాలకు వినియోగించినట్లు సీసీఎస్ విచారణలో వెల్లడైంది. ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి, ప్రజలను నమ్మించి మోసం చేసిన విధానంపై పలు ఆరోపణలు వచ్చాయి.సాహితీ స్కాంలో ఇంకా పలు కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని సీఎస్ అధికారులు తెలిపారు. మిగిలిన కేసులపై దర్యాప్తు పూర్తయింది.
