
శివాజీ, అనసూయ వివాదం నడుస్తున్న తరుణంలో.. గతంలో ఒక టీవీ షోలో ‘రాశి గారి ఫలాలు’ అంటూ అనసూయ చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇటీవల నటి రాశి స్పందించారు. ఒక మహిళ అయ్యుంది ఆ లేడీ యాంకర్ అలాంటి కామెంట్ చేయడం ఏంటని రాశి కనిపించింది. ఈ విషయంపై సూచన రాశి ఒక వీడియోని విడుదల చేశారు. తన తల్లి చెప్పడం వల్ల ఆగిపోయాయని అన్నారు. ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా అనసూయ స్పందించారు. రాశికి క్షమాపణలు చెప్పారు. (అనసూయ భరద్వాజ్)
“ప్రియమైన రాశి గారు.. మీకు నా హృదయపూర్వక క్షమాపణలు. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగులో సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీ డైలాగ్ చెప్పడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులను నేను ఆ రోజే నిలదీసి అడిగింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి కోసం అది సహకరించలేదు. ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు.
ఈరోజు మహిళల భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమ దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను.” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనసూయ.
ఇది కూడా చదవండి: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ!

