Home సినిమా పుట్టిన రోజున దీపికా పదుకునే ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు – Andhra Waves

పుట్టిన రోజున దీపికా పదుకునే ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు – Andhra Waves

by
0 comments
పుట్టిన రోజున దీపికా పదుకునే ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు



-తన బర్త్ డే రోజున దీపికా పదుకునే ప్రకటన చెయ్యడానికి కారణం ఏంటి
-తన ప్రకటనలో ఏముంది!
-ఆన్ సెట్ ద్వారా ఏం జరగబోతుంది
-అప్ కమింగ్ సినిమాల పరిస్థితి ఏంటి

భారతీయ చిత్ర పరిశ్రమ గౌరవం, పరపతి ని పెంచిన అరుదైన నటిమణుల్లో ‘దీపికా పదుకునే'(దీపికా పదుకునే)ఒకరు. ఏ క్యారక్టర్ లో అయినా సరే ది బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇవ్వగలదు. సుమారు రెండు దశాబ్దాల నుంచి ఆ విషయంలో రాజీ పడకుండా మేకర్స్ తన కోసమే క్యారెక్టర్ లు సృష్టించిన ఇమేజ్ ని పొందింది. పది సంవత్సరాల క్రితమే అమెరికన్ సినీ మేకర్స్ ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్‌లో దీపికా నటించడానికి ఒప్పించారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని సీక్వెల్ గా చేస్తున్నారు. దీపిక కోసం ముంబైలోనే ఆమె క్యారక్టర్ కి సంబంధించిన షూటింగ్ ని జరపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి దీపికా మానియా ని అర్ధం చేసుకోవచ్చు.

ఈ రోజు దీపిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ‘ఆన్ సెట్’ (onset )అనేది నా డ్రీం ప్రాజెక్ట్. ఈ ఆన్ సెట్ ద్వారా సినీ, టీవీ, అడ్వటైజింగ్ రంగాల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించబోతున్నాను. ప్రోత్సహించడమే కాదు ఆయా రంగాల్లో అవకాశాలు కూడా కలిపిస్తాను . ఈ ప్రాజెక్ట్ లో ప్రాక్టికల్ లెర్నింగ్ కే ప్రాధాన్యముంటుంది. onsetprogram.in లో మీ పూర్తి వివరాలు, ఏ డిపార్ట్‌మెంట్ కి శిక్షణ పొందాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఏం వర్క్ చేస్తున్నారో తెలపాలని దీపికా పదుకునే ఉంటుంది. అలా అప్లై చేసుకున్న పేర్లలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ కి పిలుస్తారు. ప్రస్థుతానికి నటన అవకాశం కల్పించలేదు. దర్శకత్వం, సౌండ్ డిజైన్, ఆర్ట్ అండ్ ప్రొడక్షన్, డిజైన్ లాంటి వాటినే దీపికా ఏంచుకుంది.


ఇది కూడా చదవండి: నారీ నారీ నడుమ మురారి ఓటి డీల్ ఇదేనా! సంక్రాంతి ఏం జరుగుతుందో మరి

దీపికా కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్),అట్లీ(అట్లీ)కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో చేస్తుంది. ఇప్పటికే దీపికా క్యారక్టర్ కి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో పాటు మూవీలో దీపికా రోల్ చాలా కీలకమని తెలుస్తుంది. దీపికా భర్త ప్రముఖ హీరో రణవీర్ సింగ్(Ranveersingh)ప్రస్తుతం ధురంధర్(ధురంధర్)తో రికార్డుల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక అభిమానులు సోషల్ మీడియా వేదికగా దీపికా కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.


You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird