పోస్ట్ చేయబడింది జనవరి 5, 2026 1:56PM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో భావోద్వేగానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వర్తించానని చెప్పారు. అయితే పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే తనను దారుణంగా అవమానించి బయటకు పంపారని కవిత మండలిలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
“2004లో అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు వచ్చాను. 2006లో తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టాను. 2013–14లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 2013లో కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లాం.
అటువంటి సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహితుడైన ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో ఉన్న పరిచయం వల్ల కేసీఆర్‌కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగలిగాను. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడంతో తెలంగాణ సాధన ముందుకు సాగింది” అని కవిత అన్నారు.
2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, ఆ తర్వాత నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. పార్టీలో అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని.
ఈడీ, సీబీఐ కేసుల్లో తాను పోరాడుతున్న సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలుకు పంపినా పార్టీ ఆదుకోలేదని కవిత తెలిపారు.
“అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల వరకు అన్ని చోట్లా అవినీతి జరిగింది. సిద్ధిపేట, సిరిసిల్ల నిర్మించిన కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది.
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. ఆ పరిశ్రమను తెరిపించకపోవడం నాకు అవమానకరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణలపై బీఆర్‌ఎస్‌లో పెద్ద నాయకులు చెప్పుకునే వారెవరూ స్పందించలేదు. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేర్లను మీడియాకు వెల్లడించాను” అని కవిత తెలిపారు.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, పార్టీ పేరు మార్పు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. “తెలంగాణలో రాజకీయాల్లో ఏం సాధించామో చెప్పకుండా జాతీయకి వెళ్తామని చెప్పడం సరైంది కాదు” అంటూ కవిత తన ఆవేదన వ్యక్తం చేశారు.
.webp)