Home సినిమా రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా? – Andhra Waves

రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా? – Andhra Waves

by
0 comments
రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?



శివాజీ వర్సెస్ అనసూయ
వివాదంలోకి ప్రముఖ నటి రాశి
తప్పు శివాజీదా? అనసూయదా?
రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ?
అనసూయ క్షమాపణలు చెప్పక తప్పదా?

కొద్దిరోజులుగా శివాజీ వర్సెస్ అనసూయ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘దండోరా’ మూవీ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణ గురించి శివాజీ మాట్లాడాడు. బయటకు వచ్చేటపుడు పద్ధతిగా డ్రెస్ చేసుకోవాలని సూచించాడు. ఈయన రెండు మూడు పదాలు దొర్లాడు. ఆ పరిశీలన గ్రహించిన శివాజీ.. తాను ఉపయోగించిన సామాన్లు వంటి పదాల విషయంలో వెంటనే క్షమాపణలు చెప్పాడు. కానీ, వస్త్రధారణ విషయంలో తన స్టేట్ మెంట్ కి మాత్రం కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చాడు. (శివాజీ vs అనసూయ)

శివాజీ చెప్పిన విధానం తప్పు కానీ, చెప్పిన విషయం కరెక్ట్ అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. అనసూయ వంటి వారు మాత్రం.. స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడటానికి ఆయన ఎవరంటూ ఫైర్ అయ్యారు. దీంతో ఈ వివాదం శివాజీ వర్సెస్ అనసూయగా మారింది. కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తే.. మరికొందరు అనసూయకి సపోర్ట్ గా మాట్లాడారు.

తర్వాత ఈ వివాదం పలు మలుపులు తీసుకొని.. అనసూయపై ట్రోల్స్ కి దారితీసింది. తన కొడుకే తన డ్రెస్సింగ్ స్టైల్ బాలేదని అన్నాడని ఒక ఇంటర్వ్యూలో అనసూయ చెప్పిన క్లిప్ ని వైరల్ చేశారు. అలాగే, జబర్దస్త్ వంటి టీవీ షోలలో అనసూయ మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగులను కూడా వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా రాశి ఫలాలకు బదులుగా ‘రాశి గారి ఫలాలు’ అని ఒక స్కిట్ లో అనసూయ చెప్పిన డైలాగ్ ని వైరల్ చేస్తూ.. అప్పుడు ఒక స్త్రీని ఇలా అనడం తప్పనే విషయం గుర్తుకు రాలేదా? అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.

“రాశి గారి ఫలాలు” అనే డైలాగ్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా నటి రాశి(Raasi) స్పందించారు. “శివాజీ గారు మాట్లాడింది తప్పని నేను అనను. పైగా ఆ రెండు మూడు పదాలు వాడటం తప్పని.. ఆయనే ఒప్పుకొని సారీ కూడా చెప్పారు. ఇప్పుడు నేను శివాజీ గారి గురించి మాట్లాడాను కానీ.. ఈ ఇష్యూలో నా పేరు వచ్చింది కాబట్టి, దాని గురించి మాట్లాడాలి.” అంటూ రాశి ఒక వీడియో బైట్ ని విడుదల చేశారు.

“నాలుగైదేళ్ల క్రితం ఒక టీవీ షో స్కిట్‌లో నా పేరుపై ఓ డైలాగ్ చెప్పారు. స్కిట్‌లో రాశి ఫలాలు అనే పదం రాగా.. ఆ షో యాంకర్ ఒక లేడీ అయ్యుండి కూడా ‘రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా?’ అని అడిగింది. అసలు అలా ఎలా అడుగుతుంది. అలాంటి ఆమె ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. ఆ స్కిట్ టైములో అక్కడున్న లేడీ జడ్జి కూడా గట్టిగా నవ్వేసింది. నేను ఆ ప్లేస్ లో ఉంటే నవ్వేదాన్ని కాదు.. వెంటనే ఆ స్కిట్ ని ఆపేసేదాన్ని. కామెడీ చేయొచ్చు.. కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్నతల్లికి, కన్న తండ్రికి కూడా రైట్ లేదు.” అంటూ రాశి చురకలు వేశారు.

“నేను అందరికీ ఒకటే చెప్తున్నాను. ప్రశాంతంగా ఉండు. ఎందుకు అనవసరమైన టాపిక్స్. సోషల్ మీడియాను ఒక మంచి ప్లాట్ ఫామ్‌గా ఉంది. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేసి బ్యాడ్ చేయకండి. మీ ఫ్యామిలీని చూడండి, మీ ఫ్రెండ్స్ ని చూస్కోండి. నేను లీగల్ ఇష్యూ చేద్దామనుకున్నా..అసలు నీకు కరెక్ట్ గా ఏం కావాలని?.అందుకు ఈ వీడియో చేశాను.

ప్రస్తుతం రాశి వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా హుందాగా స్పందించారు అంటూ నెటిజెన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో.. ఇప్పటికైనా రాశికి అనసూయ క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అనసూయ స్పందిస్తుందో లేదో చూడాలి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird