Home Latest News భోగాపురం ఎయిర్ పోర్టుపై పొలిటికల్ వార్ | భోగాపురం విమానాశ్రయం| విజయనగరం| ఎయిర్ ఇండియా విమానం| కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు| విశాఖపట్నం| విజయనగరం| శ్రీకాకుళం| PM MODI| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| విమానయాన శాఖ| వైఎస్ జగన్ – Andhra Waves

భోగాపురం ఎయిర్ పోర్టుపై పొలిటికల్ వార్ | భోగాపురం విమానాశ్రయం| విజయనగరం| ఎయిర్ ఇండియా విమానం| కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు| విశాఖపట్నం| విజయనగరం| శ్రీకాకుళం| PM MODI| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| విమానయాన శాఖ| వైఎస్ జగన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
భోగాపురం ఎయిర్ పోర్టుపై పొలిటికల్ వార్ | భోగాపురం విమానాశ్రయం| విజయనగరం| ఎయిర్ ఇండియా విమానం| కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు| విశాఖపట్నం| విజయనగరం| శ్రీకాకుళం| PM MODI| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| విమానయాన శాఖ| వైఎస్ జగన్


పోస్ట్ చేయబడింది జనవరి 4, 2026 4:40PM


ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. విజయనగరం షెడ్యూల్ భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి టెస్ట్ ట్రయల్ చేయడానికి భోగాపురం రన్ వే పై తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ విధంగా భోగాపురంపై అటు రాజకీయంగానూ కాక రేగుతోంది. సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

భోగాపురం ఎయిర్ పోర్టుపై క్రెడిట్ తమదేనంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమ’తులూ లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ వైఎస్ జ‌గ‌న్ అన్ని అనుమ‌తులు వ‌చ్చాకే ఆ ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసారని వాదిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినట్లు పార్టీ చెబుతోంది.

మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని వస్తోందన్నారు.పరిహార భూమి పరిస్థితిని ఎకరాకు రూ.28 నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారని, డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని అందజేస్తున్నారని వైసీపీ చెబుతోంది. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, మిగిలినవాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని వైసీపీ చెబుతోంది.దానికి టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.

భోగాపురం ఎయిర్ పోర్ట్ చంద్రబాబు దృష్టికి నిదర్శనం అని, వైసీపీ అధికారం లోకి రాక ముందే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన వైసీపీని విమర్శిస్తుంది. అలాగే జగన్ భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతికించరని దెప్పి పొడుస్తుంది. దానికి తగ్గట్లే సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి. అప్పట్లో జగన్ మాట్లాడుతూ ఎర్ర బస్సు రాణి ఎయిర్ పోర్టు ఎందుకని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఈ క్రెడిట్ వార్లో వైసీపీ తీరు చర్చల్లో నలుగుతోంది.

మరోవైపు భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌పై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్‌కావడం ఏపీ అభివృద్ధికి ఒక మైలురాయి అని తెలిపారు. #VisonVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. తమ పాలనలో వేగవంతమైన అనుమతులతో ఇది సాధ్యమైందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేయడంతో బలమైన పునాది వేశామన్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird