Home Latest News పంచాయితీ భయంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది! | భార్య మర్ఫర్ గర్ భర్త| అక్రమ| సంబంధం| సహాయం| తో – Andhra Waves

పంచాయితీ భయంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది! | భార్య మర్ఫర్ గర్ భర్త| అక్రమ| సంబంధం| సహాయం| తో – Andhra Waves

by andhra andhrawave
0 comments
పంచాయితీ భయంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది! | భార్య మర్ఫర్ గర్ భర్త| అక్రమ| సంబంధం| సహాయం| తో


జనవరి 3, 2026 1:51PMన పోస్ట్ చేయబడింది


అక్రమ సంబంధం బయటపడకూడదని కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. ఈ ఢటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వామి, మౌనికలకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే మౌనిక తనకన్నా వయస్సులో చిన్న వాడైన సంపత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. విషయం తెలిసిన భర్త స్వామి పలుమార్లు ఆమెను తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికి తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది. ఈ నేపథ్యంలోనే గత నెల 22న ఇంట్లో భర్త నిద్రపోతుండగా.. ప్రియుడు సంపత్ ను ఇంటికి పిలిచింది. ప్లాన్ ప్రకారం ఇరువురూ కలిసి స్వామి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని నేరేళ్ల కుంటలో పడ్డారు. మద్యం మత్తులో చెరువులో పడి చని కట్టుకథ అల్లి అందర్నీ నమ్మాలని ప్రయత్నించిన మౌనికకు స్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో మౌనిక నేరం ఒప్పుకుంది. ఆమెను, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్టు చేశారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird