Home Latest News ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠా అరెస్ట్ | హైదరాబాద్ పోలీస్| మెహిదీపట్నం| సీఎం రేవంత్ రెడ్డి| రాష్ట్ర ముఠా అరెస్ట్| హర్యానా| ఆసిఫ్‌నగర్| తెలంగాణ పోలీసులు – Andhra Waves

ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠా అరెస్ట్ | హైదరాబాద్ పోలీస్| మెహిదీపట్నం| సీఎం రేవంత్ రెడ్డి| రాష్ట్ర ముఠా అరెస్ట్| హర్యానా| ఆసిఫ్‌నగర్| తెలంగాణ పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠా అరెస్ట్ | హైదరాబాద్ పోలీస్| మెహిదీపట్నం| సీఎం రేవంత్ రెడ్డి| రాష్ట్ర ముఠా అరెస్ట్| హర్యానా| ఆసిఫ్‌నగర్| తెలంగాణ పోలీసులు


జనవరి 3, 2026 8:08PMన పోస్ట్ చేయబడింది


హైదరాబాద్ నగరంలో ఏటీఎంల వద్ద కేవలం చదువురాని, వృద్ధులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వారి దృష్టిని మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.52,000 నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 89 ఏటీఎం కార్డులు, మూడు సెల్‌ఫోన్లు మరియు ఒక ఆటో రిక్షాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన నిందితులు

హర్యానాకు చెందిన అమీర్ సుహెల్ @ అమీర్ సోహైల్ @ సోహెల్ (24), ముబారిక్ (26), ముస్తకీమ్ (25)తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అమేర్ (33)ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అమీర్ సుహెల్, ముబారిక్‌లు ప్రధాన నిందితులుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే….

డిసెంబర్ 31న ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అలకుంట వెంకటేష్ (38) ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అలకుంట వెంకటేష్ తన తల్లి ఏటీఎం కార్డులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్ 28న మల్లేపల్లి ఎక్స్‌రోడ్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఈ వెళ్లాడు. కానీ ఇతనికి చదువు రా అక్కడున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల సహాయం కోరాడు. వారు అతని తల్లి ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని, అందులో 1,32,000 ఉన్నట్లు చెప్పారు. అనంతరం నిందితులు కార్డు మార్చిఅలకుంట వెంకటేష్ కు ఇచ్చారు.

కార్డు తీసుకుని వెంకటేష్ వెళ్లిన అనంతరం నిందితులు అసలైన కార్డుతో రూ.40,000 నగదు విత్ డ్రా చేశారు. అనంతరం వెంకటేష్ తన తల్లి ఫోన్ కు బ్యాంకు నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఏటీఎం కార్డు తను వద్ద ఉండగా డబ్బులు ఎలా అయ్యాయి అని బాగా ఆలోచించిన వెంకటేష్ కు ఏటీఎం కార్డు వద్ద నిందితులే తనను మోసం చేశారని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తూ ఈ ముఠా వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది…ఈరోజు జనవరి 3 ఉదయం విజయ్ నగర్ కాలనీలోని ఏటీఎం వద్ద మరో నేరానికి ప్రయత్నించిన సమయంలో మెహిదీపట్నం క్రైమ్ సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. విచారణలో వారు ఏటీఎం నేరాలకు చూస్తున్నట్లుగా అంగీకరించారు.

ప్రధాన నిందితుడు అమీర్ సుహెల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదై ఉండగా, రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ముబారిక్ హర్యానాలో ఆటోమొబైల్ దొంగతనం లేదా జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.చదువురాని వారు వృద్ధులు ఏటీఎంల వద్ద డబ్బులు విత్ డ్రా చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయంలో వారికి సహాయం అందించి, పిన్ నంబర్‌ను తెలుసుకుని, కార్డులను మారుస్తూ ఖాతాల నుంచి డబ్బు కొల్లగొట్టడమే ఈ ముఠా ప్రధాన పద్ధతిగా పోలీసులు గుర్తించారు.

నిందితులను అరెస్టు చేసి మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 365/2025 కింద సెక్షన్లు 318(4), 303(2) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు. ప్రజలకు పోలీసుల సూచన ఏటీఎం కార్డును ఎవరికీ ఇవ్వకూడదని, పిన్ నంబర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు చెప్పవద్దని పోలీసులు సూచించారు. అవసరమైన బ్యాంక్ సిబ్బంది సహాయం మాత్రమే సూచిస్తున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird