Home Latest News కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన | కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో పవన్ కళ్యాణ్| వేశాడు| పునాది రాయి| అభివృద్ధి – Andhra Waves

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన | కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో పవన్ కళ్యాణ్| వేశాడు| పునాది రాయి| అభివృద్ధి – Andhra Waves

by andhra andhrawave
0 comments
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన | కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో పవన్ కళ్యాణ్| వేశాడు| పునాది రాయి| అభివృద్ధి


జనవరి 3, 2026 11:47AMన పోస్ట్ చేయబడింది


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 35.19 కోట్ల రూపాయల వ్యవయంతో భారీ మౌలిక సదుపాయాలు కల్పించారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ ప్రాథమిక సౌకర్యాలలో ప్రధానంగా దీక్ష విరమణ మండపం భక్తుల సత్రం నిర్మాణం ఉంది.

టీటీడీ నిధులతో ఇక్కడ నిర్మించనున్న దీక్ష విరమణ మండపంలో ఒకేసారి రెండువేల మంది భక్తులు అయ్యప్ప దీక్ష విరమణ చేసేలా విశాలంగా నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో పాటు, భక్తులకు అనుకూలంగా డిజైన్ చేయించాలని అధికారులు తెలిపారు. దీని వల్ల శబరిమల నుంచి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు కొండగట్టులో దీక్ష విరమణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది.

అలాగే సత్రంలో మొత్తం 96 విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకునేలా ఈ గదులను అభివృద్ధి చేయనున్నారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను కూడా సత్రంలో కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనం రాజకీయంగా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు కొండగట్టుకు మరింత ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird