జనవరి 3, 2026 8:44AMన పోస్ట్ చేయబడింది

మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. దక్షిణ మెక్సికో గెరెరో రాష్ట్రంలో సంభవించిన ఈ భూకంప భూమికి సుమారు 10 లోతులో అధికారులు ఉన్నారు. పసిఫిక్ తీరప్రాంతంలోని ప్రముఖ రిసార్ట్ నగరం అకాపుల్కో సమీపంలో ఉన్న గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ పట్టణం వద్ద భూకంప కేంద్రం ఉందని తెలిసింది. భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వివరాల అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ స్పందించారు. గెరెరో రాష్ట్ర గవర్నర్తో మాట్లాడినట్లు ఆమె ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. రాజధాని మెక్సికో సిటీలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంప తీవ్రతకు భారీ భవనాలు సైతం చిగురుటాకుల్లా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
.webp)