పోస్ట్ చేయబడింది జనవరి 2, 2026 5:24PM

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఇద్దిరిని సిట్ విచారించనుంది. గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో సారి వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.
ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, కుమారులకు 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జోగి ఫ్యామిలీకి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు.
