Home సినిమా Sahakutumbaanaam Review: సఃకుటుంబానాం మూవీ రివ్యూ – Andhra Waves

Sahakutumbaanaam Review: సఃకుటుంబానాం మూవీ రివ్యూ – Andhra Waves

by
0 comments
Sahakutumbaanaam Review: సఃకుటుంబానాం మూవీ రివ్యూ



తారాగణం: రామ్ కిరణ్, మేఘ ఆకాష్, రాజేంద్ర, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం ప్రసాద్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్: మధు దాసరి
ఎడిటర్: శశాంక్ మలి
రచన, దర్శకత్వం: ఉదయ్ శర్మ
బ్యానర్:హెచ్.ఎన్.జి సినిమాలు
విడుదల తేదీ: జనవరి 1, 2026

నూతన సంవత్సరం కానుకగా విడుదలైన సినిమాలలో ‘సఃకుటుంబానాం’ ఒకటి. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఉదయ్ శర్మ దర్శకత్వంలో హెచ్.ఎన్.జి సినిమా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..? (సహకుటుంబనం మూవీ రివ్యూ)

కథ:
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కళ్యాణ్ (రామ్ కిరణ్). తన కుటుంబంపై అపారమైన ప్రేమ చూపిస్తాడు. అదే కంపెనీలో చేరిన సిరి(మేఘా ఆకాష్)పై మనసు పారేసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఆమెని తన కుటుంబానికి పరిచయం చేసింది. అయితే ఆమె రాకతో కుటుంబంలో వచ్చే మార్పులు ఏమిటి? కళ్యాణ్ కుటుంబానికి సంబంధించి సిరి తెలుసుకున్న షాకింగ్ విషయం ఏంటి? అతనికి ఉన్న సమస్య ఏమిటి? విలన్ వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తాడు? కళ్యాణ్‌-సిరి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఇటీవల ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా తగ్గిపోయాయి. తరుణంలో ఒక మంచి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులకు అందించాలని దర్శకుడు ఉదయ్ శర్మ చేసిన ప్రయత్నం బాగుంది. అవి కుటుంబ బంధాలను ఎంతగా విభేదిస్తాయో ఈ చిత్రం ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఎమోషన్స్, కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.

కొందరు సోషల్ మీడియాలో చూపించుకునే ఫేక్ లైఫ్ స్టైల్ కి, వాళ్ళ నిజ జీవితానికి తేడా ఉంటుందనే పరిశీలన ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. అయితే దర్శకుడు ఎంపిక కథాంశం బాగున్నప్పటికీ. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా సాఫ్ట్‌వేర్ కంపెనీలో లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగానే ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.

సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మెప్పించాయి. కొన్ని సీన్స్ రొటీన్ గా కనిపిస్తున్నాయి.. తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కుటుంబ కథలకి ఆయువు పట్టు అయిన ఎమోషన్స్ మీద మరింత ఫోకస్ చేస్తే.. అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది. మొత్తానికి ‘సఃకుటుంబానాం’ని కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రంగా మలిచారు.

నటీనటులు, సాంకేతిక విభాగం పనితీరు:
హీరోగా తొలి సినిమా అయినా రామ్ కిరణ్ తనదైన యాక్టింగ్, డ్యాన్స్ లతో సత్తా చాటాడు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ రాణించాడు. రెండు విభిన్న లుక్స్‌లో కనిపిస్తూ, తొలి చిత్ర నటుడనే సందేహం రానివ్వకుండా మెప్పించాడు. మేఘ ఆకాష్ మరోసారి తన అభినయంతో ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ సహజసిద్ధంగా జీవించేశాడు. బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, నిత్య, రచ్చ రవి తక్కువ స్క్రీన్ టైమ్‌లోనూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

రచయితగా, దర్శకుడిగా ఉదయ్ శర్మకు మంచి మార్కులే పడతాయి. అయితే కథనం, సన్నివేశాల రూపకల్పన విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే.. ఇంకా మంచి సినిమాలు చేయగలరు. మధు దాసరి కెమెరా పనితనం కట్టిపడేసింది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. నృత్యాలు కూడా ప్రధాన బలంగా నిలిచాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
కథాంశం, దర్శకత్వం, నటినటుల ప్రదర్శనలు, ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ పాయింట్లు:
కొన్ని నెమ్మదిగా సాగే సీన్లు.

ఫైనల్ గా..
హృదయాన్ని తాకే సందేశంతో పాటు ఆకట్టుకునే వినోదాన్ని అందిస్తుంది ‘సఃకుటుంబానాం’. కథనం నెమ్మదిగా సాగుతుంది.. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంటుంది.

రేటింగ్: 2.5/5

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird