
-ఈ కలెక్షన్స్ నిజమేనా!
-ఎంత వచ్చాయి.
-సినిమా పరిస్థితి ఏంటి
శ్రీ నందు(శ్రీ నందు)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ 2026 కి వెల్ కమ్ చెప్తాను నిన్న ‘సైక్ సిద్ద'(సైక్ సిద్ధార్థ)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్లు భారీగా తగ్గాయి. దీనితో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు యాభై లక్షల రూపాయలు గ్రాస్ ని సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మేకర్స్ అయితే కలెక్షన్స్ వివరాలని ఇంకా అధికారంగా వెల్లడి చేయలేదు.ఇక మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు సిద్దార్ధగా నందు తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడని, ఆ క్యారెక్టర్ ని చూస్తుంటే పగ వాడికి కూడా సిద్ధమని బాధ రాకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక శంబాల, ఛాంపియన్ చిత్రాలు స్టిల్ ఇప్పటికి మంచి వసూళ్లతో దూసుకెళ్తున్నాయి. దీనితో వీకెండ్ లో సైక్ సిద్దార్ధ్ ఏ మేర కలెక్షన్స్ ని రాబడతాడో చూడాలి.
ఇది కూడా చదవండి: ఇరవై ఇదే వేలు ఇస్తే ఏమైనా చేస్తుందా! అసలు ఆట అప్పుడే అయిపోలేదు
సుమారు ఐదు కోట్ల బడ్జెట్ తో విడుదల చేసినట్లుగా ట్రేడ్ విషయానికి వస్తే సైక్ సిద్ధార్ధ 800 స్క్రీన్స్ లో విడుదలైంది. శ్రావ్య క్యారక్టర్ లో యామిని భాస్కర్(యామిని భాస్కర్)త్రిష గా చేసిన ప్రియాంక రెబకా(ప్రియాంక రెబెకా)కూడా నందుకి దీటుగా మంచి పెర్ ఫార్మ్ ప్రదర్శించారు. వరుణ్ రెడ్డి(వరుణ్ రెడ్డి)దర్శక ప్రతిభ, సాంగ్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైక్ సిద్దార్ధ కి ప్రధాన బలంగా నిలిచాయి. స్పిరిట్ మీడియా తో కలిసి నందు నే నిర్మించగా, రానా దగ్గుబాటి థియేటర్స్ లో తీసుకు రావడం జరిగింది.

