పోస్ట్ చేయబడింది జనవరి 1, 2026 9:41PM

హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవన్న సంగతి మరో సారి నాంపల్లి కోర్టు తీర్పుతో వెల్లడైంది. మద్యం సేవించి ప్రయాణికులతో నిండిన బస్సును నడిపిన డ్రైవర్‌కు నాంపల్లి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఇంటర్‌సిటీ యూనివర్సల్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న కన్నెబోయిన మహేష్‌బాబు అనే వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆ మత్తులో బస్సు నడిపినట్లు రుజువు కావడంతో నాంపల్లి కోర్టు అతనికి జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా కూడా విధించింది.
డిసెంబర్ 15న ఎస్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోకన్నెబో మహేష్‌బాబు పట్టుబడ్డాడు. మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు అనుమానం రావడంతో పోలీసులు వెంటనే బస్సును ఆపి డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వ హించారు.ఆ పరీక్షలో డ్రైవర్ రక్తంలో 119.100 mg ఆల్కహాల్ సాంద్రత ఉన్నట్లు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇతను అనుమతించిన పరిమితికి చాలా ఎక్కువగా మద్యం సేవించినట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
కోర్టులో మద్యం సేవించి భారీ వాహనాన్ని నడపడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకా శముందని పోలీసులు కోర్టుకు వివరించారు.
వాదనలు, ఆధారాలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం డ్రైవర్‌కు 15 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని… ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని ఈ తీర్పు కోర్టులో ప్రదర్శించింది.
ఈ తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు అత్యంత బాధ్యతగా వ్యవహరిం చాలని పోలీసులు సూచిస్తున్నారు.
.webp)