Home సినిమా టాలీవుడ్ లో ఫస్ట్ టైం.. పెళ్లి రిసెప్షన్ లా మూవీ ఈవెంట్! – Andhra Waves

టాలీవుడ్ లో ఫస్ట్ టైం.. పెళ్లి రిసెప్షన్ లా మూవీ ఈవెంట్! – Andhra Waves

by
0 comments
టాలీవుడ్ లో ఫస్ట్ టైం.. పెళ్లి రిసెప్షన్ లా మూవీ ఈవెంట్!



మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. (అనగనగా ఒక రాజు)

జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘అనగనగా ఒక రాజు’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ఇక తాజాగా మరో వైవిధ్యమైన వేడుకను నిర్వహించారు చిత్ర బృందం. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక’ ఘనంగా జరిగింది. పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అడుగడుగునా వైవిధ్యం ఉట్టిపడింది.

నాయకానాయికలు నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’ ‘భీమవరం బాల్మా’, ‘రాజు గారి పెళ్లిరో’ పాటలకు వేదికపై నృత్యం చేసి అందరిలో ఉత్సాహం నింపారు. అనంతరం అందరికీ స్వాగతం పలికి, రిసెప్షన్ వేడుకను తలపించారు. ఇక నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరుల వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రికేయలు బంధుమిత్రుల్లా ఒక్కొక్కరిగా వేదికపైకి వచ్చి.. ఆ జంటను ఆశీర్వదించడం, గిఫ్ట్ కవర్ ఇచ్చి వారిని ఓ ప్రశ్న అడగటం.. ఇలా ఎంతో కొత్తగా, సరదాగా ఈ వేడుక నడిచింది.

ఈ వేడుకలో కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఈ నూతన సంవత్సరం 2026 అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. 2024 అనేది నా జీవితంలో చాలా క్లిష్టమైన సంవత్సరం. వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అదే ఉత్సాహంతో మీ ముందుకు మరో అదిరిపోయే సినిమాని తీసుకొద్దాం అనుకున్నాను. రాజు’ కథ రాసుకోవడం ఆ సమయంలో ‘అన్నా సినిమా ఎప్పుడు?’ అని చాలామంది మెసేజ్ లు చేశారు. మీ అందరి ప్రేమ, మద్దతు వల్లే నేను త్వరగా కోలుకోగలిగాను. మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

మీ అందరి ప్రేమతోనే మేము ఈ సినిమా షూటింగ్ ని సరదాగా ఆరు నెలల్లో పూర్తి చేయగలిగాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంతటి వినోదాత్మక చిత్రం ఎప్పుడు విడుదల చేద్దామనే చర్చ వస్తే.. సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని మా నిర్మాతలు భావించారు. నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్ కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ పండుగ అందరి వల్లే ఇంతటి వినోదంతో నిండిన ఈ సంక్రాంతికి తీసుకొస్తున్నాము. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. అందులో ఒక వైబ్ ఉంటుంది. నేను, మీనాక్షి సహా టీం అందరం మనసు పెట్టి పనిచేశాం. జనవరి 14న విడుదలవుతున్న ‘అనగనగా ఒక రాజు’ మీరు కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.

ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి ‘మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్ గారి ‘ది రాజా సాబ్’తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇన్ని మంచి సినిమాలతో ఈసారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండగను తీసుకుని వస్తుంది. తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “ఇది నా మూడో సంక్రాంతి సినిమా. ‘అనగనగా ఒక రాజు’లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అన్నారు.

‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో విడుదలైంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird