డిసెంబర్ 31, 2025 10:02AMన పోస్ట్ చేయబడింది

సుప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఘోర అపచారం జరిగింది. సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం (డిసెంబర్ 29 రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో క్లూస్ టీం, చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని. మంత్రి ఆనం సూచనూ.. ధ్వంసమైన చోట ఇప్పటికే వేద పండితుల సమక్షంలో కొత్త శివలింగాన్ని పునఃప్రతిష్ఠించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయమని అధికారులను ఆదేశించారు.
మరోవైపు, ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఖండించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, హిందూ ధర్మంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
