డిసెంబర్ 30, 2025 6:50PMన పోస్ట్ చేయబడింది

సులభంగా డబ్బు వస్తుందన్న ఆశతో అమాయకులు చేస్తున్న చిన్న తప్పిదాలు, భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. చాలా మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల మాయలో పడి బ్యాంక్ ఖాతాలను ఇతరులకు అప్పగించడం, తెలియని వ్యక్తుల నుంచి డబ్బు స్వీకరించడం, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లను నమ్మడం వంటి చర్యల కారణంగా వందలాది బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యే కేసులు పెరిగాయని అధికారులు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించిన డబ్బు లావాదేవీలు జరుగుతు న్నట్లు గుర్తించిన పోలీసులు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు వెంటనే ప్రకటించారు. అసలు ఎలా ఫ్రీజ్ అవుతున్నాయి? వ్యాపార రుణాలు ఇప్పిస్తామని, క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని, సైబర్ మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కావనే సైబర్ కేటుగాళ్లు బాధితుల బ్యాంక్ ఖాతాలను తమ నియంత్రణలోకి తీసుకుని అక్రమ లావాదేవీలు జరిపారు, ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ (USDT) కొనుగోళ్లకు నిల్వ చేసింది.
ఇలాంటి అక్రమ లావాదేవీల్లో ఉపయోగించిన ఖాతాలను పోలీసులు గుర్తించి ఫ్రీజ్ ఇచ్చారు. అలాగే ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, నకిలీ ఇన్‌వెస్ట్‌మెంట్ యాప్‌లు, అక్రమ లోన్ యాప్‌ల ద్వారా వచ్చిన డబ్బు కూడా సైబర్ నేరాలకు సంబంధించినదని అధికారులు తెలిపారు. ‘మనీ మ్యూల్’గా మారుతున్న యువతవిద్యార్థులు, నిరుద్యోగ యువత, డ్రైవర్లు, రోజువారీ కూలీలే ప్రధానంగా సైబర్ నేరగాళ్ల లక్ష్యమవుతున్న న్నారని పోలీసులు తెలిపారు.
