Home Latest News నూతన సంవత్సరం వేళ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం | తెలంగాణ ఎక్సైజ్ శాఖ| నకిలీ మద్యం| హైదరాబాద్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

నూతన సంవత్సరం వేళ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం | తెలంగాణ ఎక్సైజ్ శాఖ| నకిలీ మద్యం| హైదరాబాద్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
నూతన సంవత్సరం వేళ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం | తెలంగాణ ఎక్సైజ్ శాఖ| నకిలీ మద్యం| హైదరాబాద్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి


డిసెంబర్ 30, 2025 7:11PMన పోస్ట్ చేయబడింది


నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవాలంటే మందు, చిందు ఉండాల్సిందే… ఈ కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యం విపరీతంగా అమ్ముడు పోతుంది. అయితే దీన్నే లక్ష్యంగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించి డబ్బులు సంపాదించాలని ఆశించారు కానీ పాపం పోలీసులు ఇచ్చిన ట్విస్ట్‌తో జైలు పాలయ్యారు.

నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎక్సైజ్ కమీషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ పహాడ్‌ షరీప్‌తో పాటు సంగారెడ్డి ప్రధాన రహదారిపై నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ మద్యం పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 229 మద్యం బాటిళ్లతో పాటు 7.165 లీటర్ల మద్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పడ్‌షరీప్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ నిర్వహించిన తనిఖీల్లో, ఎయిర్‌పోర్టు మార్గంగా గోవా, ఢిల్లీ, హర్యానా వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం వాహనాలను తనిఖీ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 229 మద్యం బాటిళ్లు వెలుగులోకి వచ్చాయి.

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించిన అధికారులు తెలిపారు.ఇక సంగారెడ్డి ప్రధాన రహదారిపై తనిఖీల్లో గోవా ప్రాంతం నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న 7.165 లీటర్ల మద్యం కూడా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మద్యం అక్రమ రవాణాతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లిందని, దీనిని అరికట్టేం దుకు నిఘా పెంచినట్లు అధికారులు గుర్తించారు.

నూతన సంవత్సరం వేడుకల సమయంలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, బోర్డుపై గట్టి నిఘా ఉంచినట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird