Home Latest News న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ మోసగాళ్ల టోకరా | నూతన సంవత్సర శుభాకాంక్షలు| APK ఫైల్‌లు| ఫ్యాక్టరీ సెట్టింగ్‌లు| సైబర్ క్రైమ్| హైదరాబాద్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ మోసగాళ్ల టోకరా | నూతన సంవత్సర శుభాకాంక్షలు| APK ఫైల్‌లు| ఫ్యాక్టరీ సెట్టింగ్‌లు| సైబర్ క్రైమ్| హైదరాబాద్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ మోసగాళ్ల టోకరా | నూతన సంవత్సర శుభాకాంక్షలు| APK ఫైల్‌లు| ఫ్యాక్టరీ సెట్టింగ్‌లు| సైబర్ క్రైమ్| హైదరాబాద్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి


డిసెంబర్ 30, 2025 7:25PMన పోస్ట్ చేయబడింది


నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా మలుచుకున్న సై నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తరకం ఎత్తుగడలకు తెరలేపారు… “న్యూ ఇయర్ గ్రీటింగ్స్”, “గిఫ్ట్” అంటూ లింకులు, ఏపీకే (APK) ఫైల్స్ పంపిస్తూ అమాయక జనాలపై వల విసురుతున్నారు. . గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వస్తున్న ఈ ఫైల్స్‌ను ఓపెన్ చేస్తే మొబైల్ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న ఏపీకే గిఫ్ట్ ఫైల్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో ఉన్న కీలక సమాచారం మొత్తం హ్యాక్ అవుతోంది. ముఖ్యంగా బ్యాంక్ యాప్స్, వాలెట్ యాప్స్‌ను ఓపెన్ చేసి ఖాతాల్లోని డబ్బును క్షణాల్లో ఖాళీగా ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొంతమంది నేరగాళ్లు బాధితుల పేరుతోనే వారి కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యక్తులకు “డబ్బులు కావాలి” అంటూ మెసేజ్‌లు పంపి మోసానికి గురవుతున్నారు. అలాగే వాట్సప్‌ను హ్యాక్ చేసి బాధితుల స్నేహితులు, బంధువులకు డబ్బులు పంపాలని మెసేజ్‌లు పంపుతున్న ఘటనలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి.

ఈ తరహా మోసాల వల్ల ఇప్పటికే లక్షల రూపాయలు కోల్పోయిన సైబర్ క్రైమ్ అధికారులు ఈ విషయంలో డీసీపీ, సైబర్ క్రైమ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్, గిఫ్ట్ లింకులు ఓపెన్ చేయవద్దు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వచ్చే అనుమా నాస్పద మెసేజ్‌లను ఓపెన్ చేయకూడదు…ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలి.

ఒకవేళ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లినట్లు గుర్తిస్తే, తక్షణమే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అదనపు తక్షణమే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయాలని, పాస్‌వర్డ్‌లను మార్చాలని సూచించింది. నూతన సంవత్సరం సంబరాల సమయంలో చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird