Home Latest News వల్లభనేని వంశీని వీడని కేసుల గ్రహణం…మళ్లీ అజ్ఞాతంలోకి | వల్లభనేని వంశీ| విజయవాడ| మాచవరం | YSRCP| వైఎస్ జగన్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

వల్లభనేని వంశీని వీడని కేసుల గ్రహణం…మళ్లీ అజ్ఞాతంలోకి | వల్లభనేని వంశీ| విజయవాడ| మాచవరం | YSRCP| వైఎస్ జగన్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
వల్లభనేని వంశీని వీడని కేసుల గ్రహణం...మళ్లీ అజ్ఞాతంలోకి | వల్లభనేని వంశీ| విజయవాడ| మాచవరం | YSRCP| వైఎస్ జగన్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్


డిసెంబర్ 30, 2025 6:34PMన పోస్ట్ చేయబడింది


గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని కేసుల గ్రహణం వీడటం లేదు. తాజాగా ఆయనపై మరో హత్యాయత్నం కేసు నమోదవ్వడంతో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారు. 2024 జూన్ 7వ తేదీన సునీల్ అనే వ్యక్తిపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 17వ తేదీన మాచవరం పోలీసులు వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. సునీల్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మొదటి నుంచే వంశీ పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తు కొనసాగుతున్న కీలక ఆధారాలు లభించడంతో, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు విజయవాడ మాచవరం పోలీసులు గుర్తించారు.

ఈ కేసు నమోదు తర్వాత నుంచి వల్లభనేని వంశీ పోలీసులకు రాలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వంశీపై కేసు నమోదు కావడం, వెంటనే ఆయన కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. గతంలోనూ వివాదస్పద అంశాల్లో ఆయన పేరు వినిపించిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది

ఇదిలా ఉంటే.. గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వంశీ, వైసీపీ కీలక నేతలు దాడి చేశారు. ఈ కేసులో సత్యవర్థన్ ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈ కేసు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే సత్యవర్థన్‌ను వంశీ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులోనే ఆయన జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం సునీల్‌పై హత్యాయత్నం కేసులో మాచవరం పోలీసులు వంశీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయనకు సంబంధించిన సన్నిహితులు, అనుచరులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

వంశీ దేశంలోనే ఉన్నారా లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఎంతటి రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు స్పష్టం చేశారు. వంశీని త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం గన్నవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా భద్రతపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మాచవరం పోలీసులు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird