Home Latest News వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..! | వాల్ నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు| వాల్‌నట్స్ ప్రయోజనాలు| వాల్ నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| మహిళలకు వాల్‌నట్స్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| ఆడవారికి వాల్‌నట్స్ యొక్క ప్రయోజనాలు – Andhra Waves

వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..! | వాల్ నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు| వాల్‌నట్స్ ప్రయోజనాలు| వాల్ నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| మహిళలకు వాల్‌నట్స్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| ఆడవారికి వాల్‌నట్స్ యొక్క ప్రయోజనాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..! | వాల్ నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు| వాల్‌నట్స్ ప్రయోజనాలు| వాల్ నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| మహిళలకు వాల్‌నట్స్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| ఆడవారికి వాల్‌నట్స్ యొక్క ప్రయోజనాలు


డిసెంబర్ 27, 2025 3:22PMన పోస్ట్ చేయబడింది


ఆరోగ్యం కోసం, శరీరానికి కావలసిన ప్రోటీన్, పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నాట్స్ తింటారు. వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి. ధర కాస్త ఎక్కువ కాబట్టి సాధారణ ప్రజలు వాల్నట్లకు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్ చాలా బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే..

వాల్నట్స్ లో పోషకాలు..

వాల్నట్స్ లో అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి.

గుండె ఆరోగ్యం..

వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట. అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట.

రక్తపోటు..

రోజు రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు వాల్నట్స్ ను తీసుకుంటే చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది.

బరువు…

బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నాట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యం..

మానసిక ఆరోగ్యం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

జీర్ణవ్యవస్థ..

జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణశక్తి పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోశాయి. వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది.

వాపులు, నొప్పులు..

వాల్నాట్స్‌లో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల7ణాలు వాపులు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

*రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించబడ్డాయి. వారి ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird