
-ఏంటి ఆ మూవీ
-హీరో ఎవరు
-ఎప్పుడు రిలీజ్
-వారణాసి అప్ డేట్ ఏంటి
భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి(SS రాజమౌళి)ది అగ్ర స్థానం అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ట్రాక్ రికార్డు అలాంటిది మరి. ఈ సారి తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టేలా ‘వారణాసి'(Varanasi)ని ముస్తాబు చేస్తున్నాడు. ఇండియన్ చిత్ర సీమలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న మహేష్ బాబు(మహేష్ బాబు) కెరీర్ తో పాటు తన కెరీర్ లో ఒక మర్చిపోలేని మూవీగా నిలిచిపోయేలా కంకణం కట్టుకుని చిత్రీకరిస్తున్నాడు. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు ‘వారణాసి’ ని చూద్దామా అనే ఆశతో ఉన్నారు. కానీ వాళ్ల ఆశ ఫలించటానికి రెండు సంవత్సరాలు ఆగాల్సిందే. కానీ అప్పటి వరకు తన అభిమానులను బాధపెట్టడం ఎందుకని వచ్చే ఏడాది రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై తాను ఇప్పటి వరకు వదిలిన బాణాల్లోని బాణాన్ని మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నాడు.
రాజమౌళి, నాని(నాని),సమంత(సమంత), సుదీప్ కాంబోలో వచ్చిన ఈగ(ఈగ)ఎంత పెద్ద విజయాన్ని చూసిందో తెలుసా. 2012లో వచ్చిన ఈ మూవీలో నటినటుల పెర్ ఫార్మెన్స్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, గ్రాఫిక్స్ ఒకదానికొకటి పోటీపడి మరి మెస్మరైజ్ చేయడంతో ప్రతి ఒక్కరు ఎంతగానో ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ లో రీ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు వారణాసి టీం నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
కూడా చదవండి: అనసూయకి సలహా ఇస్తున్న ప్రకాష్ రాజ్.. వినలేదంటున్న శివాజీ
