Home Latest News ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..! | నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఉత్తమ ఆలోచనలు| నూతన వేడుక శుభాకాంక్షలు| పిల్లలకు నూతన సంవత్సర వేడుకలు| పిల్లల కోసం కొత్త సంవత్సర వేడుకల ఆలోచనలు| కొత్త సంవత్సరం వేడుక – Andhra Waves

ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..! | నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఉత్తమ ఆలోచనలు| నూతన వేడుక శుభాకాంక్షలు| పిల్లలకు నూతన సంవత్సర వేడుకలు| పిల్లల కోసం కొత్త సంవత్సర వేడుకల ఆలోచనలు| కొత్త సంవత్సరం వేడుక – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..! | నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఉత్తమ ఆలోచనలు| నూతన వేడుక శుభాకాంక్షలు| పిల్లలకు నూతన సంవత్సర వేడుకలు| పిల్లల కోసం కొత్త సంవత్సర వేడుకల ఆలోచనలు| కొత్త సంవత్సరం వేడుక


డిసెంబర్ 26, 2025 1:32PMన పోస్ట్ చేయబడింది


కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు. అలా జరగాలని కూడా కోరుకుంటారు. అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది. ఇప్పుడైతే తొందరలోనే కొత్త ఏడాది రాబోతోంది. క్యాలెండర్ తో పాటు తమ జీవితం కూడా మారాలని కొండంత ఆశ పెట్టుకుని ఉంటారు అందరూ. మరీ ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తమ కంటే ఎక్కువగా తమ పిల్లల జీవితం గురించి ఆలోచిస్తారు. తమ పిల్లలు సంతోషంగా ఉండాలని, చదువులో, కెరీర్ లో విజయం సాధించాలని కోరుకుంటారు. చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఈ కొత్త ఏడాదిలో తమ పిల్లలు విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటారు. అయితే పిల్లలు కొత్త ఏడాదిలో సక్సెస్ కావాలన్నా, వారి భవిష్యత్తు మరెంతో గొప్పగా ఉండాలన్నా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే..


రీడింగ్..

చదవడం వల్ల పిల్లల ఊహ, భాష, ఆలోచన అన్నీ బలపడతాయి. రోజూ చదివే పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం నుండి రోజుకు కనీసం 30 నిమిషాలు చదివే అలవాటు చేసుకోవాలని పిల్లలకు చెప్పాలి. ఏదైనా చదవవచ్చు. కథ, కామిక్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ అందించే పుస్తకం.. ఇలా ఎంచుకోవచ్చు.

రాత్రి సమయం..

కొత్త సంవత్సరంలో పిల్లలు ఫోన్‌కు దూరంగా ఉండే అలవాటు చేయాలి. పగటిపూట నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం వల్ల నిద్ర, కంటి చూపు దెబ్బతింటుంది. పడుకునే గంట ముందు మొబైల్ ఫోన్‌ను దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

నిద్ర..

ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ఫాలో కావాల్సిన మంచి అలవాటు ఏంటంటే.. సరైన సమయానికి పడుకుని, సరైన సమయానికి మేల్కోవడం. పిల్లల మానసిక అభివృద్ధికి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాత్రి సరైన సమయానికి పడుకుని, ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.

నేర్చుకోవడం..

నేర్చుకునే అలవాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇది పిల్లలను పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తుంది. పిల్లలు పదజాలం, చిత్రలేఖనం, సంగీతం లేదా క్రీడలు ఏదైనా కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు చాలా సహకారం అందించాలి.

నడవడిక..

ఎవరికైనా సరే ధాంక్స్ చెప్పడం, పెద్దలను గౌరవించడం, సహాయం చేయడం వల్ల వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసే అలవాట్లు. ఇతరులను గౌరవించడం, మంచి మర్యాదలను అలవర్చుకోవడం చేయాలి.

ఆహారం..

పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసిరి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ కు బదులుగా పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లల రోగనిరోధక శక్తి, పెరుగుదలకు మంచి ఆహారపు అలవాట్లు చాలా అవసరం.

వ్యాయామం.. ఆటలు..

పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం, ఆటలు చాలా బాగా సహాయపడతాయి. పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోవడం ప్రోత్సహించాలి. ఇది పిల్లలను సామాజికంగా కలిసిపోయేలా చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లలకు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాల శారీరక శ్రమ అవసరం. అందువల్ల పిల్లలు తమ శారీరక వ్యాయామాన్ని, బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఆడుకోవడాన్ని ప్రోత్సహించాలి. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి.

*రూపశ్రీ.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird