Home Latest News కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మొనగాడు… ఆయన పేరు చెబుతా : కేటీఆర్ | సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..! BRS పార్టీ| కేసీఆర్| GHMC ఎన్నికలు| భీమవరం| మేడిగడ్డ| కేసీఆర్| కాంగ్రెస్ పార్టీ| గుంటూరు – Andhra Waves

కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మొనగాడు… ఆయన పేరు చెబుతా : కేటీఆర్ | సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..! BRS పార్టీ| కేసీఆర్| GHMC ఎన్నికలు| భీమవరం| మేడిగడ్డ| కేసీఆర్| కాంగ్రెస్ పార్టీ| గుంటూరు – Andhra Waves

by andhra andhrawave
0 comments
కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మొనగాడు... ఆయన పేరు చెబుతా : కేటీఆర్ | సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..! BRS పార్టీ| కేసీఆర్| GHMC ఎన్నికలు| భీమవరం| మేడిగడ్డ| కేసీఆర్| కాంగ్రెస్ పార్టీ| గుంటూరు


డిసెంబర్ 26, 2025 1:56PMన పోస్ట్ చేయబడింది


మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పుకుని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవును మా అయ్య తెలంగాణ తెచ్చిన మగాడు. మొనగాడు..మా నాన్న పేరు కాకుంటే ఇంకెవరు పేరు చెప్పుకుంటారు. బరాబర్ చెబుతా నువ్వు మంచి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు చెడు పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడని కేటీఆర్.

కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు ముఖ్యమంత్రిపై నాకు గొంతు వరకు కోపం ఉంది. నేను గుంటూరులో చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదని ప్రశ్నించారు. ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకున్నాడు కాబట్టి చిట్టినాయుడు పేరు భీమవరం బుల్లోడు అని పెడదామని విమర్శలు గుప్పించారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం ఇబ్బంది..నేను ప్రపంచమంతా చదువుకున్నాఅని కేటీఆర్ చెప్పారు.

జీహెచ్‌ఓ వరుసగా ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను రెండుసార్లు గెలిపించిన హైదరాబాద్‌ ప్రజలకు పాదాభివందనం చేసిన తక్కువేనని కేటీఆర్ అన్నారు. నేడు శేరిలింగంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి ప్రశ్నిస్తే బూతులు తిడుతుందని, తిట్ల భాష తమకూ వచ్చినా తాము అలా చేయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఎగనామం పెట్టారని. పింఛన్లు ఎప్పటి నుంచి పెంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird