Home సినిమా ఛాంపియన్ ఫస్ట్ డే కలెక్షన్ ఇవే!.. నిజమేనంటారా! – Andhra Waves

ఛాంపియన్ ఫస్ట్ డే కలెక్షన్ ఇవే!.. నిజమేనంటారా! – Andhra Waves

by
0 comments
ఛాంపియన్ ఫస్ట్ డే కలెక్షన్ ఇవే!.. నిజమేనంటారా!



-కలెక్షన్స్ ఇవేనా!
-మూవీకి అయితే పర్వాలేదనే టాక్
-రోషన్ పర్ఫార్మెన్స్ కి ఫిదా

తెలుగు చిత్రపరిశ్రమలో సుదీర్ఘ కాలంగా రాణిస్తూ తన కంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు శ్రీకాంత్(శ్రీకాంత్).ఆయన తనయుడు రోషన్(రోషన్)నిన్న క్రిస్మస్ కానుకగా ‘ఛాంపియన్'(ఛాంపియన్)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇండియాకి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానంతో కూడిన తెలంగాణని పరిపాలిస్తున్ననిజాం పాలకుల ఇండియాలో కలవడానికి ఇష్టపడరు. దీంతో సిద్ధిపేట జిల్లాలో ఉన్న బైరాన్ పల్లి గ్రామానికి చెందిన ప్రజలు నిజాం దాష్టీకాలకి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తి నింపుతారు. వీరితో దేశంలో సెటిల్ అవ్వడానికి సికింద్రాబాద్‌కు చెందిన మైఖేల్ విలియమ్స్ అనే యువకుడు కూడా కలిసి పోరాటం చేశాడు. ఆ పోరాటంలో ప్రాణాలు కూడా కోల్పోయాడు.ఈ కథ తోనే ఛాంపియన్ ప్రదర్శించింది. మరి ఈ తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ సాధించిందో చూద్దాం.

ఫస్ట్ డే 2.75 కోట్ల రూపాయలని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఈ కలెక్షన్స్ పై అధికార ప్రకటన రాకపోయినా రోషన్ గత చిత్రాలతో ఛాంపియన్ కి బాగానే వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. మూవీ చూసిన ప్రేక్షకులు అయితే పర్వాలేదనే స్థాయిలో ఉందని, మైకేల్ విలియమ్స్ క్యారక్టర్ లో మాత్రం రోషన్ నటన అత్యద్భుతంగా ఉందని అంటున్నారు. రివ్యూస్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో వీకెండ్ లో ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందనే ఆసక్తి నెలకొని ఉంది.

ఇది కూడా చదవండి: ఛాంపియన్ మూవీ రివ్యూ.. హిట్టా, ఫట్టా

ఇక ఈ మూవీ ఎంత బడ్జెట్ తో తెరకెక్కిందో అని మేకర్స్ అధికారంగా వెల్లడి చేయలేకపోయా. ముప్పై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై మూవీ చూస్తుంటే మాత్రం ముపై కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువే అయినట్టుగా ఉంది. అంతలా మేకర్స్ అయిన స్వప్న సినిమాలు, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ మూవీస్ గ్రాండ్ గా నిర్మించారు. రోషన్ సరసన అనస్వర రాజన్(Anaswara Rajan) జత కట్టగా ప్రదీప్ అద్వైతం(Pradeep advaitham)దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీత సారధ్యం వహించాడు.

.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird