Home Latest News ఒడిశాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి | ఒడిశాలో ఎన్‌కౌంటర్| కన్హమల్| రెండు| చనిపోయిన| ఆయుధాలు – Andhra Waves

ఒడిశాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి | ఒడిశాలో ఎన్‌కౌంటర్| కన్హమల్| రెండు| చనిపోయిన| ఆయుధాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఒడిశాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి | ఒడిశాలో ఎన్‌కౌంటర్| కన్హమల్| రెండు| చనిపోయిన| ఆయుధాలు


25 డిసెంబర్, 2025 12:52PMన పోస్ట్ చేయబడింది


ఒడిశాలోభద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోలు మరణించారు. కంధమల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవుల్లో మావోయిస్టుల సంచారంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) బలగాలు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మృతులలో ఒకరిని ఏసీఎం బారి అలియాస్ రాకేష్ రాయగడగా పేర్కొన్నారు. మరో మృతుడు ప్లాటూన్ సభ్యుడు అమృతగా పేర్కొన్నారు. వీరిద్దరూ జిల్లాలో పలు నక్సల్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ప్రస్తుతం గుమ్మ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసా గుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరి స్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird