డిసెంబర్ 24, 2025 3:01PMన పోస్ట్ చేయబడింది

పేరు మోసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో పోలీస్ కస్టడీ నుండి తప్పిపోయిన పరారైన ఈ నింది తుడు ప్రస్తుతం తమిళ నాడులో వరస నేరాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. గతంలో హైదరాబాదులోని ప్రిజం పబ్‌లో కాల్పులు జరిపి హల్ చల్ సృష్టించిన బత్తుల ప్రభాకర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ పిటి వారెంట్ మీద పోలీసులు అతన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ నెలలో విజయ వాడ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు మార్గమధ్యంలో ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో బత్తుల ప్రభాకర్ విసర్జనకు అంటూ పోలీసుల కస్టడీని తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుండి అతని కోసం గాలింపు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియో పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. బత్తుల ప్రస్తుతం తమిళనాడులో ఉంటూ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్‌గా చేసుకొని చోరీలకు చూస్తున్నట్లుగా ఆ వీడియో ద్వారా వెల్లడైంది. ఈ కారణంగానే ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బత్తుల ప్రభాకర్ చోరీకి చెన్నైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ కాలేజీ లాకర్ నుండి 60 లక్షల వరకు నగదు కొట్టేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి హైదరాబాదులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనానికి వచ్చిన ప్రభాకర్ అక్కడ పోలీసుల నుండి తప్పించుకొని ప్రిజం పబ్బులోకి వెళ్లి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో విజయ వాడ నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా తప్పించుకొని పారిపోయిన బత్తుల ప్రభాకర్ చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను దొంగతనాలకు గురిచేసి ఆ విధంగా చోరీల ద్వారా సంప ద డబ్బుతో బత్తుల ప్రభాకర్ జల్సాలు చేస్తున్నారు. చెన్నై కాలేజీ చోరీకి సంబంధించిన కీలక సీటీవీ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కడంతో బత్తుల ప్రభాకర్ జాడ కనుక్కున్నాడు.
ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పరారీలో ఉన్న బత్తుల ప్రభాకర్ తమిళనాడులో ప్రత్యక్షమై చోరీలకు పోలీసులను ఆశ్రయించడంతో అతన్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నేర చరిత్ర కలిగిన బత్తుల ప్రభాకర్ పట్టుకోవడం పోలీసులకు ఒక సవాలుగా మారింది.
