Home సినిమా అంగరంగ వైభవంగా ‘సుమతీ శతకం’ చిత్ర టీజర్ లాంచ్! – Andhra Waves

అంగరంగ వైభవంగా ‘సుమతీ శతకం’ చిత్ర టీజర్ లాంచ్! – Andhra Waves

by
0 comments
అంగరంగ వైభవంగా 'సుమతీ శతకం' చిత్ర టీజర్ లాంచ్!



విషన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్‌దీప్ చౌదరి, స్టైల్ చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, జెడివి ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్‌పేట శైలజ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించగా నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్‌ను ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జివి ఆంజనేయులు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జివి ఆంజనేయులు మాట్లాడుతూ… “చిత్ర బృందం అందరికీ మంచి సినిమా తీసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ టీజర్‌కు అందరికీ అభినందనలు సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చూస్తేనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అర్థం అవుతుంది.

అతిథి నిర్మాత, నటుడు అశోక్ కొల్ల మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. శ్రీధర్ గారు నాకు చాలా కాలం నుండి తెలుసు. ఈ చిత్ర టీజర్ చాలా బావుంది. ఇప్పుడు చిన్న సినిమాలు వచ్చి పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది అని అర్థం అవుతుంది.

అతిథి కంఠమనేని శివ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ పేరు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. చిత్ర టీం అందరికీ ఆల్ దిగ్గజం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

అతిథి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ… “నాకు బాగా కావలసిన వ్యక్తులు ఈ చిత్ర నిర్మాతలు. ఈ సినిమా టీజర్ చూస్తే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం విజయాలు అందుకుంటున్న వరుసలో ఈ సినిమా ఉంటుంది” అన్నారు.

అతిథి నిర్మాత వంశీ నందిపాటి… “ఈ పాటకి వచ్చిన అందరికీ నమస్కారం. నిర్మాత సాయి కొమ్మాలపాటి అని సాయి గారిని పిలవడానికి నేను ఆనందంగా ఫీల్ అవుతాను. సుమతీ శతకం చిత్ర టీజర్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. హీరో అమరదీప్, హీరోయిన్ శైలి, దర్శకుడు నాయుడు గారికి ఆల్ ది బెస్ట్. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ… “సుమతీ శతకం చిత్ర టీజర్ విడుదల సందర్భంగా ఈ చిత్రం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కథానాయిక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా అమరదీప్‌కి మంచి మైలేజ్ తీసుకువస్తుంది అని కోరుకుంటున్నాను. దర్శకుడికి ఈ సినిమా మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ… “ఈ చిత్ర కుటుంబంలో నేను ఒక వ్యక్తి కావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో పాటలు చాలా బావుంటాయి. సంగీతం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గారికి ధన్యవాదాలు. ఆయనతో నాకు 10 సంవత్సరాల ప్రయాణం. సినిమా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను” అన్నారు.

యశ్ని గౌడ మాట్లాడుతూ… “చిత్ర బృందం అందరికీ కృతజ్ఞతలు. చిత్ర టీజర్ అందరికీ బాగా నచ్చింది అని అర్థం అవుతుంది. సినిమాను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను”.

నటుడు అర్జున్ అంబటి మాట్లాడుతూ… “ఈ పాటకి వచ్చి అందరికి థాంక్స్. దర్శకుడు చాల కష్టపడి సినిమా తీశారు. నిర్మాతలకు నా స్నేహితుడు అమర్దీప్ ను నమ్మి సినిమాను తెరకెక్కించినందుకు థాంక్స్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ దిస్ట్ ” అన్నారు.

సుధాకర్ కొమ్మాలపాటి మాట్లాడుతూ… “ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయి వచ్చిన మీడియా నిర్మాత అందరికీ, అలాగే ఈ అతిధులుగా వచ్చిన అందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కథ దర్శకుడు మా దగ్గరకు కలిసి ఎంటర్టైన్ అయ్యేలా అనిపించింది. అమర్దీప్ ప్రేక్షకులు ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలుసు. అలాగే సరదాగా, ఆక్టివ్ గా ఉంటాడు. అలాగే ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ చాలా బాగా పనిచేశారు. ఫిబ్రవరి 6న మంచి తెలుగుతనం ఉన్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోయిన్ స్టైల్ చౌదరి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. టీజర్ లాంచ్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, నాతో నటించిన అమర్‌దీప్, ఇతర నటీనటులకు ధన్యవాదాలు. మీడియా వారికి, ప్రేక్షకులకు థాంక్స్

దర్శకుడు ఎంఎం నాయుడు మాట్లాడుతూ… “ఈ పాటలు రాసిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా నన్ను నమ్మి సినిమాను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చిన నిర్మాత గారికి, నా దర్శకుల బృందానికి థాంక్స్. సినిమాలో నటించిన అమర్‌దీప్ గారికి, ఇతర నటీనటులకు నన్ను నమ్మినందుకు థాంక్స్. దర్శకుడు సంగీత దర్శకుడు మంచి సంగీతాన్ని అందించారు.

హీరో అమర్దీప్ మాట్లాడుతూ… “ఈ సినిమాకి వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. నాకు సినిమాలో అవకాశం ఇచ్చి ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా ప్రేక్షకులకు అంతా వినోదాత్మకంగా ఉంటుంది. కష్టపడి సినిమాకు సపోర్ట్ చేశారు. అందరూ ఈ సినిమా సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందిస్తారని అన్నారు

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird