Home సినిమా జేమ్స్ కామెరూన్ కి సంబంధించిన అసలు నిజాలు ఇవే – Andhra Waves

జేమ్స్ కామెరూన్ కి సంబంధించిన అసలు నిజాలు ఇవే – Andhra Waves

by
0 comments
జేమ్స్ కామెరూన్ కి సంబంధించిన అసలు నిజాలు ఇవే




-ఏంటి ఆ నిజాలు
-గత చరిత్ర ఏం చెప్తుంది!
-ఎన్నో సంచలనాలు సృష్టించాడు
-అత్యంత ధనవంతుడు కూడా

ప్రపంచ సినీ పితామహుడు ఎవరంటే సినీ మేకర్స్, సినీ అభిమానుల నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క మాట ‘జేమ్స్ కామెరూన్’. ఈ విషయంలో మిగతా వాళ్ళకి డౌట్ ఉంటే రీసెంట్ గా వచ్చిన ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ తో పాటు అయన నుంచి వచ్చిన గత చిత్రాలే ఉదాహరణ. భూమ్మీద కాలుమోపిన ఒక అతీంద్రియ శక్తిల వరల్డ్ సినిమా పాతిక సంవత్సరాల తర్వాత ఆలోచించేది కామెరూన్ పాతిక సంవత్సరాల క్రితమే ఆలోచించి సిల్వర్ స్క్రీన్ పై ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసాడు. సరికొత్త స్క్రీన్ ప్లే ని,టెక్నలాజి ని పరిచయం చేయడంతో పాటు కథ, కథనాలలో వేగాన్ని పెంచిన ఘనత కూడా కామెరూన్ సొంతం.అందుకే ప్రపంచ సినీ పితామహుడిగా మారాడు.సోషల్ మీడియాలో తాజాగా కామెరూన్ ప్రారంభ జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

కామెరూన్ పదిహేడేళ్ల వయసులోనే కాలేజీ చదువుకి స్వస్తి చెప్పి పలు రకాల ఉద్యోగాలు చేసాడు.ఈ కావాలనే ట్రక్ (లారీ)డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుని సినీరంగంలోకి అడుగుపెట్టి రోజర్ కార్మాన్ న్యూ వరల్డ్ పిక్చర్స్ అనే సంస్థలో వారానికి 175 దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేరాడు. 1978లో 12 నిమిషాల నిడివితో 20000 డాలర్స్ తో ‘జీనో జెనిసస్’ అనే సైన్స్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో షార్ట్ ఫిలింని రూపొందించాడు. మన ఇండియన్ కరెన్సీ లో చెప్పుకోవాలంటే దగ్గర గా 18 లక్షల రూపాయిలు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు 1981లో ‘పిరాన్హా 2: ది స్పానింగ్’ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసి మనస్పర్థలు రావడంతో మూవీ కంప్లీట్ కాకముందే దర్శకత్వబాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 1984లో ‘ది టెర్మినేటర్’ మూవీతో మళ్లీ దర్శకుడిగా మారారు.

వరల్డ్ వైడ్ గా వ్యక్తి చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కామెరూన్ పేరు మారుమోగిపోయింది.ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసిన తర్వాత 1997లో టైటానిక్ మూవీతో ప్రపంచం మెస్మరైజ్ చేసాడు.తెలుగులో కూడా ఆ చిత్రం విడుదలై చాలా ఏరియాల్లో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత 12 సంవత్సరాలకు అవతార్ ప్రపంచాన్ని సృష్టించాడు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా కేవలం ఇంత వరకు పదకొండు చిత్రాలే వచ్చినా అవన్నీ వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై మరిచిపోలేని చిత్రాలుగా నిలిచిపోయాయి.

కూడా చదవండి: నన్ను క్షమించండి.. స్త్రీ అంటే ఒక మహా శక్తి

ప్రస్తుతం రిలీజైన అవతార్: ఫైర్ అండ్ యాష్ చిత్రం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 3,000 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో కూడా ఒకరు. నివేదికల ప్రకారం ఆయన ఆస్తులు 1.1 బిలియన్లు . అవతార్ 4 2029 డిసెంబర్ 21 న రానుంది. మరి మూడు అవతార్ భాగాలను మించి నాలగ అందించాలని కామెరూన్ ఇప్పట్నుంచే కసరత్తుల్లో ఉంటారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird