Home Latest News వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు.. షర్మిల ఎక్కడ? | వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు| విజయమ్మ| హాజరు| షర్మిల – Andhra Waves

వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు.. షర్మిల ఎక్కడ? | వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు| విజయమ్మ| హాజరు| షర్మిల – Andhra Waves

by andhra andhrawave
0 comments
వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు.. షర్మిల ఎక్కడ? | వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు| విజయమ్మ| హాజరు| షర్మిల


డిసెంబర్ 24, 2025 11:31AMన పోస్ట్ చేయబడింది


వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ఆ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడమన్నది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. పులివెందులలోని తమ పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. పులివెందులలోని వైఎస్ నివాసంలో వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే వైఎస్ కుటుంబీకులంతా. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల హాజరు కాలేదు.

షర్మిల విన ఈ వేదకకు వైఎస్ కుటుంబంలోని దాదాపు అందరూ. జగన్, ఆమె తల్లి విజయమ్మ చాలా కాలం తరువాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. అయితే వారిరువురూ దూరందూరంగా కూర్చోవడంపై కూడా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన గ్రూప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వేడుక ఎప్పుడు జరిగింది? అన్న విషయంపై స్పష్టత లేదు. ఆ ఫొటో ఈ ఏడాది జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినదా, పాతదా అన్న అనుమానాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సామాజిక మాధ్యమంలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ షర్మిల ఎక్కడ అంటూ నెటిజనులు పోస్టు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో ఈ ఫొటో తాజాగా ఉంద‌ని భావిస్తున్న‌వ‌చ్చు అని ప‌రిశీల‌కులు అంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్, షర్మిల మధ్య దూరం తరగలే దనడానికి ఈ ఫొటో నిదర్శనంగా ఉందని చెబుతున్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, అందుకు ధాంక్యూ షర్మిలమ్మ అంటూ జగన్ రిప్లై ఇవ్వడంతో ఇరువురి మధ్య సయోధ్య ఏర్పడిందన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. ఇప్పుడు తాజాగా పులవెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు జరుపుకున్న మినీ క్రిస్మస్ వేడుకల్లో షర్మిల కనిపించకపోవడం వీరి మధ్య విభేదాలపై మరో సారి చర్చకు తెరలేపింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird